అంతర్జాతీయం

జిన్నాకే గాంధీ ఓటు.. వ్యతిరేకించిన నెహ్రూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తొలి ప్రధాని ఎంపికపై దలైలామా సంచలన వ్యాఖ్యలు
పనాజీ, ఆగస్టు 8: స్వతంత్ర భారత తొలి ప్రధానిగా మహమ్మద్ అలీ జిన్నా పేరును మహాత్మా గాంధీ ప్రతిపాదించారని, కానీ, జవహర్‌లాల్ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జిన్నాను ప్రధానిగా చేయాలన్న ఆలోచనను నెహ్రూ అంగీకరించి ఉంటే, దేశ విభజన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నెహ్రూ స్వార్థపూరితంగా వ్యవహరించారని అన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 83 ఏళ్ల దలైలామా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, ఫ్యూడల్ వ్యవస్థతో పోలిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో ఉన్నతమైనదని వ్యాఖ్యానించారు. నిర్ణయాధికారం కొంత మందికి మాత్రమే పరిమితమైతే అనర్థాలు తప్పవని అన్నారు. ‘్భరత్ విషయాన్ని తీసుకుంటే, జిన్నాకు ప్రధాన మంత్రి పదవిని అప్పగించేందుకు మహాత్మా గాంధీ సుముఖత వ్యక్తం చేశారు. కానీ, నెహ్రూ వ్యతిరేకించారు. ఒక రకంగా చెప్పాలంటే, నెహ్రూ కొంత స్వార్థపూరితంగా వ్యవహరించారు. గాంధీ కోరుకున్నట్టు జిన్నా ప్రధానైవుంటే, దేశ విభజన జరిగేది కాదు’ అని అభిప్రాయపడ్డారు. నెహ్రూ తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆయన చాలా అనుభవజ్ఞుడని దలైలామా ప్రశంసించారు. ఆయన చాలా విజ్ఞత కలిగిన వారని, కానీ, జిన్నాకు ప్రధాన మంత్రి పదవిని ఇచ్చే విషయంలో పొరపాటు చేశారని అన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, టిబెట్ నుంచి తప్పించుకోవడమే తన జీవితంలో అత్యంత భయానకమైన, మరుపురాని సంఘటనగా దలైలామా అభివర్ణించారు. ‘1959 మార్చి 17వ తేదీ అర్ధరాత్రి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను కొంత మంది ముఖ్య అనుచరులతో కలిసి టిబెట్ నుంచి తప్పించుకొని భారత్‌చేరుకున్నాను. టిబెట్‌పై చైనా ఉక్కుపాదం మోపడం, అన్ని రకాలుగా వేధించడాన్ని మేము వ్యతిరేకించాం. దీనితో చైనా నాపై కక్ష కట్టింది. టిబెట్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నించాను. చైనా అధికారులతో చర్చించాను. కానీ, నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో మార్గం లేకపోవడంతో, అక్కడి నుంచి తప్పించుకున్నాను’ అని వివరించారు. ఆ సమయంలో మరుసటి రోజు చూస్తానో లేదోననే ప్రశ్న తనను వేధించిందని అన్నారు. తాను తప్పించుకున్న మార్గం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉందని అన్నారు. చైనా మిలటరీ స్థావరం పక్క నుంచే తప్పించుకున్నానని చెప్పారు. ఆ సమయంలో చైనా మిలటరీ అధికారులు, జవాన్లను తాను అతి సమీపం నుంచి చూశానని తెలిపారు. ‘మేము నిశ్శబ్దంగానే ఉన్నాం. కానీ, గుర్రాల అడుగుల సవ్వడిని ఎలా ఆపగలం? ఆ సమయంలో చాలా భయపడ్డాను’ అని దలైలామా నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. 16 సంవత్సరాల వయసులో తాను స్వాతంత్య్రాన్ని కోల్పోయానని, 24 ఏళ్ల వయసులో దేశానే్న విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిబెట్ నుంచి తప్పించుకున్న తర్వాత సుమారు 17 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కానీ, ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు, సమస్యలు ఎదురైనప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చుకోలేదని, దృఢ సంకల్పంతో అడుగు ముందుకేశానని చెప్పారు. మరో ప్రశ్నపై స్పందిస్తూ చైనాను శత్రువులుగా టిబెటన్లు ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. వారిని గౌరవిస్తామని, సోదరుల్లా భావిస్తామని అన్నారు.