అంతర్జాతీయం

దిగొచ్చిన బిహార్ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌పూర్/పాట్నా, ఆగస్టు 8: ముజఫర్‌పూర్ షెల్టర్‌హోమ్ సెక్స్‌కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మంత్రి మంజు వర్మ ఎట్టకేలకు పదవి రాజీనామా చేశారు. మంత్రి భర్త చందేశ్వర్ వర్మ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చిన మంత్రి మంజు వర్మ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనకు తలొగ్గారు. బుధవారం ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. షెల్టర్ హోమ్ నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్‌తో మంత్రి భర్త చండేశ్వర్ వర్మ నిత్యం ఫోన్‌లో సంప్రదిస్తూ ఉండేవాడని కాల్‌డేటాలో వెల్లడైంది. అక్టోబర్, మార్చి నెలల మధ్య కాలంలో మంత్రి భర్త చండేశ్వర్ తొమ్మిది సార్లు విద్యార్థినుల హోమ్‌కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. వెళ్లిన ప్రతిసారీ గంటల కొద్దీ అక్కడే గడిపినట్టు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. చండేశ్వర్ వర్మ విద్యార్థినులపై నాలుగేళ్ల నుంచి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. హోమ్‌లోని 30 మంది విద్యార్థినులపై దాడులు, అత్యాచారం, చిత్రహింసలకు గురిచేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇప్పటి వరకూ తన భర్త ఎలాంటి నేరం చేయలేదని చెబుతూ వచ్చిన మంత్రి మంజు వర్మ హోమ్ నిర్వాహకుడు ఠాకూర్‌తో చండేశ్వరకు సంబంధాలున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. బాలికల సంరక్షణ అధికారి భార్య అరెస్టుతో మంత్రి వర్మ భర్త పేరు బయటకు వచ్చింది. ముజఫర్‌పూర్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రవి రోషన్ భార్య షీబా కుమారి మంత్రి మంజు వర్మ భర్తపై అనేక ఆరోపణలు చేసింది. చండేశ్వర్ తరచూ హోమ్‌కు వచ్చేవాడని పోలీసు దర్యాప్తులో ఆమె వెల్లడించింది. కాల్‌డేటా రికార్డులు పరిశీలించినా అసలు నేరస్తుడెవరో తెలియరాలేదు. చండేశ్వర్‌ను విచారిస్తే కుంభకోణానికి అసలు సూత్రధారులెవరో తెలుస్తుంది. మంజు వర్మ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంజు వర్మ రాజీనామా వార్తను తోసిపుచ్చారు.
కాగా ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్రజేష్ ఠాకూర్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మంజు వర్మ భర్తతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఈ కేసులో తనను రాజకీయ బలిపశువును చేశారని అతడు ఆరోపించాడు. బ్రజేష్ సహా తొమ్మిది మందిని ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బ్రజేష్ మీడియాతో మాట్లాడుతూ తనను ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేయాలని భావించానని, దాన్ని దృష్టిలో పెట్టుకునే తనను రాజకీయ బలిపశువును చేశారని ఆరోపించాడు. అయితే బ్రజేష్ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.్ఠకూర్‌కు కనీసం పార్టీ ప్రాధమిక సభ్యత్వమే లేదని కేసు నుంచి బయటపడడానికే కట్టుకథలు అల్లాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రేమ్‌చంద్ మిశ్రా విమర్శించారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. జన్ అధికార్ పార్టీ కార్యకర్తలు కొందరు కోర్టు ప్రాంగణంలో హల్‌చల్ చేశారు. నల్లజెండాలతో నినాదాలు చేశారు.