అంతర్జాతీయం

వచ్చేవారం పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 8: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో జాతీయ అసెంబ్లీని సమావేశపరిచే అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం అధ్యక్షుడికి నివేదిక సమర్పించింది. ఈ విషయాన్ని న్యాయ, సమాచార శాఖ మంత్రి అలీ జాఫర్ ధ్రువీకరిస్తూ జాతీయ అసెంబ్లీని ఈ నెల 12 నుంచి 14వ తేదీ మధ్య సమావేశపరచి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సమావేశంలోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుందని అన్నారు. చట్టప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా ఎన్నికైన సభ్యులతో జాతీయ అసెంబ్లీ సమావేశం కావాలని, అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని జాఫర్ తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల ఫలితాలు విడుదల చేయడంలో జాప్యం జరిగిందని, దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ మంగళవారం ఫలితాలను ప్రకటించినా, జాతీయ అసెంబ్లీకి చెందిన 9, రాష్ట్రాలకు చెందిన 17 సీట్లకు చెందిన ఫలితాలను నిలిపివేసింది. ఈసీ నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మరో వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈసీ నిలిపివేసిన 9 జాతీయ సీట్లలో ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ నాలుగింటిని గెలుచుకుంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ మూడు సీట్లను, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, బెలూచిస్తాన్ అవామీ పార్టీ ఒక్కో సీటును దక్కించుకున్నాయి. ఈ సీట్ల ఫలితాలను ఈసీ తాజాగా నిలిపివేసింది. కాగా, తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ను పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో 14 లేదా 15 తేదీల్లో ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

అవినీతి ఉచ్చులో ఇమ్రాన్ సన్నిహితుడు
* దేశం వదిలివెళ్లరాదని బుఖారీకి ఎన్‌ఏబీ హెచ్చరిక
ఇస్లామాబాద్, ఆగస్టు 8: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు జుల్ఫీకర్ అబ్బాస్ బుఖారీ దేశం విడిచివెళ్లకుండా నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు బుఖారి ఇస్లామాబాద్-2 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. బుఖారిపైన అవినీతి అభియోగాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇబ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాక్వాన్ అబ్బాసిని ఓడించారు. ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో బుఖారి పేరును చేర్చా రు. దీంతో పాకిస్తాన్‌ను వదిలి ఎక్కడికి బుఖారీ ప్రయాణం చేసేందుకు వీలు లేదు. అంతకుముందు బుఖారీ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టారు. గత నెలలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్ ఫరూక్ మాత్రం బుఖారీ బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. కాని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఆదేశాల మేరకు బుఖారీ పేరును బ్లాక్ ఇలస్టు, ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో ఉంచారు. మాజీ ప్రధాని కార్యదర్శి ఫద్వాడ్ హసన్ పేరును కూడా బ్లాక్‌లిస్టులో ఉం చారు. ఆషియానా ఇక్బాల్ హౌసింగ్ స్కీం కేసులో ఫద్వాడ్ హసన్‌పై అభియోగాలు వచ్చాయి. దీంతో నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో జూలై 5వ తేదీన ఫడ్వాడ్‌ను అరెస్టు చేసింది.

నవాజ్ కుమారుల పాస్‌పోర్టులు నిలిపివేత
ఇస్లామాబాద్, ఆగస్టు 8: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు హసన్, హుసేన్ పాస్‌పోర్టులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. పాకిస్తాన్ పాస్‌పోర్టులతో విదేశీ పర్యటనలు చేయకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడి యా కథనాలు వెల్లడించాయి. నవాజ్ షరీఫ్ కుమారులిద్దరూ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. 2017 జూలైలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు నవాజ్ షరీఫ్‌ను దోషిగా నిర్ధారించిన తరువాత హసన్, హుసేన్‌పై అవినీతి కేసులు నమోదయ్యాయి. వారిపై మూడు కేసులుండగా కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వచ్చా రు. దీంతో హసన్, హుసేన్ పరారీలో ఉన్న నిందితులుగా కోర్టు ప్రకటించంది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) నవాజ్ కుమారుల పాస్‌పోర్టులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల ని ఇమ్మిగ్రేషన్,పాస్‌పోర్టు డైరెక్టరేట్‌ను అభ్యర్థించినట్టు జియోన్యూస్ వెల్లడించింది. అలాగే హసన్, హుసేన్‌పై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయాలని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ(ఎఫ్‌ఐఏ) గత వారం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. షరీఫ్ ఇద్దరు కుమారులపై న్యాయస్థానం శాశ్వత అరెస్టు వా రెంట్లు జారీ చేసింది. అవినీతి కేసుల్లోనే పాక్ సుప్రీం కోర్టు గతవారం సంచలన తీర్పును వెలువరించింది. నవాజ్‌కు పదేళ్ల జైలు విధించింది. నవాజ్ కుమార్తె మరియంకు ఏడేళ్లు, ఆమె భర్తకు ఏడాది జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.