అంతర్జాతీయం

బిన్నత్వంలో ఏకత్వం భారత్‌కే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 15: భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు తీసుకుంటున్న చర్యల ద్వారా దక్షిణాసియాలోనే భారతదేశం చక్కని ఉదాహరణగా నిలిచిందని అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మిచాయెల్ పోంపెయో భారతదేశానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఇప్పటికే ఎన్నో రంగాల్లో అభివృద్ధిపథాన పరుగులు తీస్తోందని, భారత్-అమెరికా దేశాల మధ్య ఇటీవల కాలంలో వ్యాపార, వాణిజ్య రంగాల్లో సన్నిహిత సంబంధాలు మెరుగయ్యాయని అన్నారు. భారత్‌కు చెందిన ఎంతోమంది విద్యావంతులైన యువకులు తమ దేశానికి చదువు, ఉద్యోగాల కోసం వస్తుండడంతో ఇరు దేశాల మధ్య అవినాభావ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం భారత్ చేపడుతున్న చర్యలను తమ దేశం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని అన్నారు. ఆరోగ్యం, ఇంధన వనరులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ తీసుకునే అన్ని చర్యలకు తమ దేశం సంపూర్ణంగా సహకరిస్తుందని పేర్కొన్నారు.

అరెవాడలో ఎగిరిన నల్ల జెండా
* స్వాతంత్య్ర వేడుకలు బహిష్కరించాలని ప్రజలకు మావోల పిలుపు
గడ్చిరోలి, ఆగస్టు 15: మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా అరెవాడ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మావోయిస్టులు నల్లజెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వెళ్లిన స్థానికులు కార్యాలయ ఆవరణలో నల్లజెండా ఎగురుతున్న విషయాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. గ్రామ సేవక్ వెంటనే ఈ విషయాన్ని తమకు తెలియజేసినట్టు భామ్గ్రడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ మద్నే తెలిపారు. గడ్చిరోలి జిల్లా కేంద్రం నుండి దాదాపు 180 కిలోమీటర్ల పరిధిలోని మారుమూల ప్రాంతంలో అరెవాడ పంచాయతీ కార్యాలయం ఉంది. పంచాయతీ కార్యాలయంపై నల్లజెండా ఎగురుతున్న విషయాన్ని స్థానికులు తమకు తెలియజేశారని, కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఏ క్షణానైనా తమపై దాడులు జరిగే ఆస్కారం ఉండడంతో తాము అక్కడకు వెళ్లలేకపోయామని ఆయన అన్నారు. అయితే, అప్పటికే ఆ నల్లజెండాను తొలగించినట్టు గ్రామస్థులు చెప్పారని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని మావోయిస్టులు పంచాయతీ కార్యాలయం బయట ఒక బ్యానర్‌ను అంటించినట్టు స్థానికులు పేర్కొన్నారని ఆయన తెలిపారు.