అంతర్జాతీయం

పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్టుకు కోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 17: మనీ ల్యాండరింగ్ కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీపీపీ కోచైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీతోబాటు మరో 15మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ జరపాల్సిందిగా ఆ దేశానికి చెందిన ఓ బ్యాంకింగ్ కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను న్యాయస్థానం జారీచేసింది. నకిలీ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఈ కుంభకోణంలో 35 మిలియన్ రూపాయల ధనం మనీల్యాండరింగ్‌కు గురైందన్నది ఆరోపణ. కాగా సెప్టెంబర్ 4వ తేదీలోగా అరవై మూడేళ్ల జర్దారీని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పాక్ బ్యాంకింగ్ కోర్టు ఆదేశించినట్లు వార్తాసంస్థ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. అయతే మాజీ పాక్ అధ్యక్షుడికి అలాంటి వారెంట్లేవీ జారీ కాలేదని పీపీపీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలావుండగా జర్దారీ, ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్‌లతోబాటు మొత్తం 18 మందిని అనుమానితులుగా పేర్కొంటూ దాఖలైన ఇంటీరియమ్ చార్జిషీట్ కేసులో వీరంతా పరారీలో ఉన్న నిందితులుగా ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) పేర్కొంది. అయితే తల్పుర్‌కు ఈ కేసులో బెయిలు లభించింది. 2015లో జరిగిన అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీల్లో 29 బినామీ అకౌంట్లను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఇందులో 16 సమ్మిట్ బ్యాంకువి కాగా మరో ఎనిమిది సింధ్ బ్యాంకు, ఐదు యునైటెడ్ బ్యాంకువిగా గుర్తించారు. గత జూలైలో దర్యాప్తు సంస్థ అందించిన నివేదిక ఆధారంగా పాకిస్తాన్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ చైర్మన్ హుస్సేన్ లవాయ్ అరెస్టుకు కోర్టు ఆదేశాలివ్వడం జరిగింది. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూసే వరకు ఆయన రిమాండ్‌ను పొడిగించినట్లు ఎఫ్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.