అంతర్జాతీయం

పశ్చిమ కనుమల వల్లే వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 22: కేరళలో జల విధ్వంసం, వరదల బీభత్సంపై అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాటిలైట్ డేటాను సేకరించింది. వీడియో ద్వారా సేకరించిన దృశ్యాలను శాటిలైట్ డేటాలో నిక్షిప్తం చేశారు. కేరళలో నమోదైన వర్షపాతం, వరద నీటి ప్రవాహం వివరాలను కూడా సేకరించారు. కేరళలో ఈ ఏడాది కనీవినీ ఎరుగని విధంగా వరదలు సంభవించాయి. నైరుతి రుత పవనాల రెండు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కేరళ జలమయమైంది. గత వందేళ్లలో ఈ తరహా వరదలు రాలేదని వాతావరణ శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. పశ్చిమ కనుమలు 2వేల మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని, వీటి వల్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని నాసా పేర్కొంది. వర్షాలు విపరీతంగా కురిసేందుకు పశ్చిమ కనుమలే కారణమని నాసా తేల్చింది. డేటాను సేకరించేందుకు ఇంటిగ్రేటెడ్ మల్టీ శాటిలైట్ రిట్రీవల్స్ ఫర్ జీపీఎం, మైక్రోవేవ్ సెన్సార్లను ఉపయోగించారు. నాసా, జపాన్ ఏరోస్పేస్ ఏజన్సీలు ఉమ్మడిగా గ్లోబల్ ప్రిసిపిటేషన్ మెజర్‌మెంట్ (జీపీఎం) టెక్నాలజీని వినియోగించాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య కురిసిన అతి భారీ వర్షాల తీరు వివరాలను సేకరించారు. మొదటి దశలోనైరుతి రుతు పవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం నమోదైంది. రెండవ దశలో పశ్చిమ కనుమలు, నైరుతి రుతుపవనాల వల్ల విస్తారంగా అతి భారీ వర్షపాతం నమోదైంది. కేరళలో రెండవ దశలో కురిసిన భారీ వర్షాల వల్ల 231 మంది మరణించారు. లక్షలాది మంది నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటకే తీవ్రమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. హిమాలయాల కంటే పశ్చిమ కనుమలు చిన్నవే. కాని తాజాగా కేరళలో సంభవించిన విపత్తులో పశ్చిమ కనుమల పాత్ర ఎక్కువగా ఉందని నాసా పేర్కొంది.