అంతర్జాతీయం

భారత్, పాక్ మైత్రికి నిర్మాణాత్మక కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 22: భారత్, పాకిస్తాన్ దేశాల ద్వైపాక్షిక మైత్రీ సంబంధాలు బలపడే దిశగా నిర్మాణాత్మక కృషి జరుపుతామని చైనా విదేశంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని రెండు దేశాల ప్రధాన మంత్రులు వ్యక్తం చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. భారత్, పాక్ తమకు పొరుగు దేశాలని, కాబట్టి ఈ రెండింటి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని చైనా కోరుకుంటున్నదని చెప్పారు. దక్షిణ ఆసియాలో భారత్, పాకిస్తాన్ దేశాలు అత్యంత కీలకంగా ఉన్నాయని, ఆ కోణంలో చూసినా ద్వైపాక్షిక సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందని కాంగ్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానిగా ఇటీవలే పదవీ స్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే ద్వైపాక్షిక చర్చలకు శ్రీకారం చుడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా అవసరమైన సహాయసహకారాలను అందించడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. క్రీయాశీలక పాత్రను పోషించడానికి వెనుకంజ వేయబోమని వ్యాఖ్యానించారు. దక్షిణ ఆసియా ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్, పాక్ ఈ ప్రాంతంలో అత్యంత కీలక దేశాలు కాబట్టి, వాటి మధ్య సయోధ్య కొనసాగాలని హితవు పలికారు. ఇరు దేశాల ప్రధాన మంత్రులు చర్చల ప్రస్తావన తీసుకొచ్చినందుకే తాము కూడా సానుకూలంగా స్పందిస్తున్నామని కాంగ్ స్పష్టం చేశారు. భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని కాంగ్ అన్నారు.