అంతర్జాతీయం

బ్రిటన్‌ను కుదిపేస్తున్న ఇమ్మిగ్రేషన్ స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 22: బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విధానానికి భారతీయులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బ్రిటన్‌ను విండ్రష్ ఇమ్మిగ్రేషన్ స్కాం కుదిపేస్తోంది. బ్రిటన్ పాలనలో ఉన్న దేశాల మధ్య సమన్వయం, అభివృద్ధి సాధనకు కామన్‌వెల్త్ నేషన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు బ్రిటన్‌కు వెళ్లి స్థిరపడే సంప్రదాయం ఉండేది. 1973 కంటే ముందు కామన్ వెల్త్ దేశాల నుంచి వెళ్లి బ్రిటన్‌లో అనేక మంది స్థిరపడిన వారికి పౌరసత్య హక్కులు ఇవ్వడం ఇంగ్లాండ్‌కు కత్తిమీద సవాలుగా మారింది.
ఏదో వంక పెట్టి కామన్‌వెల్త్ దేశాల నుంచి వెళ్లి స్థిరపడిన వారికి పౌరసత్యం ఇచ్చేందుకు నిరాకరించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో తప్పుడు ధృవపత్రాలతో స్థిరపడి 1973 ముందు వచ్చామని చెబుతున్న వారి పూర్వపరాలను ఇంగ్లాండ్ తనిఖీ చేసింది. ఈ తనిఖీలో తప్పుడు ధృవపత్రాలు చూపారన్న కారణంపై అనేక మందిని గుర్తించి వారి దేశాలకు పంపించివేయాలని ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఇంగ్లాండ్ నిర్ణయం వల్ల అనేక మంది భారతీయులు వెనక్కు వచ్చే పరిస్థితి నెలకొంది. జమైకా, కరేబియన్, భారత్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారని మైగ్రేషన్ అబ్జర్వేటరీ డిప్యూటీ డైరెక్టర్ రాబ్ మెక్‌నెల్ చెప్పారు. కాగా నిజమైన ధృవపత్రాలు సమర్పించిన 102 మంది భారతీయులకు అత్యవసర టాస్క్ఫోర్స్ నిబంధనల కింద ఇంగ్లాండ్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు మాత్రమే అవకాశం కల్పించారు. యుకె హోంకార్యదర్శి విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారం కరేబియన్ దేశాలైన జమైకా నుంచి 1093 కేసులు, బార్బడస్ నుంచి 213 మంది, భారత్ నుంచి 102 మంది, గ్రెనెడా నుంచి 88 మంది, త్రినిడాడ్ నుంచి 86 మంది, ఇతరుల కేటగిరీ కింద 680 కేసుల విషయంలో పౌరసత్వం మంజూరు చేసే విషయమై ఇంగ్లాండ్ నిర్ణయం తీసుకోలేదు. 102 మంది భారతీయుల్లో 69 మందికి లైన్ క్లియర్ అయింది. వీరంత 1973కంటే ముందు మైనర్లుగా ఇంగ్లాండ్‌కు వచ్చారని, వీరికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
విండ్రష్ జనరేషన్ అంటే 1948లో జమైకా నుంచి విండ్రష్ అనే నౌకలో వీరంతా ఇంగ్లాండ్‌కు వచ్చారు. అప్పటి నుంచి వారంతా ఇంగ్లాండ్‌లో ఉన్నా ఇప్పటికీ సరైన డాక్యుమెంటేషన్ లేదు. దీంతో వీరిని వెనక్కు పంపించివేస్తామని, పౌరసత్వం ఇచ్చేదిలేదని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది. కాగా 70 ఏళ్లక్రితం చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం చేసి, సరైన వారికి పౌరసత్వం ఇస్తే బాగుంటుందని లేబర్ పార్టీ ఎంపీ వెట్టే కూపర్ బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.