అంతర్జాతీయం

నేడు బీమ్ స్టెక్ దేశాల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండూ, ఆగస్టు 29: ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, స్నేహ సంబంధాల వల్లనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన బంగాళాఖాతం తీరంలో ఉన్న బంగ్లాదేశ్, ఇండియా, మియాన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాల (బీమ్‌స్టెక్) సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సు ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. బీమ్‌స్టెక్ దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేందుకు, ప్రాంతీయ భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండాలని, లుక్ ఈస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందన్నారు. ఈ రెండు విధానాలను భారత్ ఆవిష్కరించి 21 ఏళ్లు గడచిందన్నారు. బంగాళాఖాతం తీరంలో ఉన్న దేశాల మధ్య బలమైన, భద్రతతో కూడిన సంబంధాలు నెలకొల్పాలన్న లక్ష్యంతో బీమ్‌స్టెక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
విదేశాంగ శాఖ ప్రతినిధి రావేష్ కుమార్ మాట్లాడుతూ బీమ్ స్టెక్ దేశాల సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారన్నారు. బుధవారం ఇక్కడ బీమ్‌స్టెక్ దేశాల మంత్రుల సదస్సును నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గైవాలి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శాంతి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఆసియా దూసుకుపోతోందన్నారు. బీమ్ స్టెక్ దేశాల ప్రాంతీయ అభివృద్ధికి సహకరించుకోవాలన్నారు. ఈ సదస్సు తర్వాత ఖాట్మాండూ డిక్లరేషన్ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సదస్సుకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి అబుల్ హసన్ మహమూద్ అలీ, శ్రీలంక విదేశాంగ శాఖమంత్రి వసంత సేనానాయక్, థాయిలాండ్ మంత్రి డాన్ ప్రముద్వినాయ్, భూటాన్ విదేశాంగ కార్యదర్శి సోనమ్ షాంగ్ ఆధ్వర్యంలో ఆయా దేశాల ప్రతినిధుల బృందాలు హాజరవుతున్నారు. మంగళవారం బీమ్‌స్టెక్ దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రపంచ దేశాల్లో బీమ్ స్టెక్ దేశాల జనాభా 22 శాతం ఉంది. ఈ దేశాల ఉమ్మడి జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు ఉంది. 1997లో తొలిసారిగా బీమ్‌స్టెక్ దేశాల సమావేశం జరిగింది.