అంతర్జాతీయం

ప్రొఫెసర్ కిరాతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్, ఆగస్టు 29: భార్యను కిరాతకంగా చంపేసిన ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చెయింగ్ కీ ఛుంగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. భార్యను చంపేసి మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కేసి తన ఆఫీసులోనే ఉంచాడు. విద్యుత్ వైరు మెడకు బిగించి అంత్యత పాశవికంగా భార్యను చంపేశాడని పోలీసులు వెల్లడించారు. తనతో గొడవపడి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదంటూ ఛుంగ్ ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు అనుమానం కలిగింది. ఛుంగ్ ఓ చెక్కపెట్టెను బయట నుంచి తీసుకొస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం మధ్యాహ్న సమయంలో పోలీసులు మెరుపుదాడి చేసి ప్రొఫెసర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. భార్య, పిల్లలతోపాటు ఛుంగ్ నివసించే డార్మిటరీని పరిశీలించారు. అక్కడ రక్తపుమరకలు గుర్తించారు. సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తుండడంతో లోతుకంటూ విచారించారు. ఛుంగే భార్యను హత్యచేసి, సూట్‌కేసులో కుక్కేసినట్టు తేలింది. యూనివర్శిటీ పాలకవర్గ సభ్యుడైన ఛుంగ్ హాస్టల్ వార్డెన్‌కూడా.

భారత్-బల్గేరియా మధ్య పర్యాటక రంగం ఒప్పందం
న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత్-బల్గేరియా దేశాల మధ్య పర్యాటక రంగంలో పరస్పర సహకారం అభివృద్ధికి నిర్దేశించిన అంశాలపై ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఈ ఒప్పందాన్ని ఆమోదించింది.రు దేశాల మధ్య పర్యాటక రంగంలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. హోటళ్లు, టూర్ ఆపరేటర్లు మద్య అనుసంధానం ఏర్పాటు చేస్తారు. మానవ వనరుల విభాగాలను పటిష్టం చేస్తారు. పర్యాటక రంగం ప్రదేశాలపై పరస్పరం సమాచారాన్ని పంచుకుంటారు.
ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతుందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది. 1994లో ఇరు దేశాల మధ్య పర్యాటక రంగంపై కుదిరిన ఒప్పందం వల్ల నిర్దేశించిన లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. 2017లో బల్గేరియా నుంచి భారత్‌కు 5288 మంది పర్యాటకులు వచ్చారు. ఈ ఒప్పందం వల్ల పర్యాటక రంగంలో రెవెన్యూ పెరిగింది.