అంతర్జాతీయం

చైనాతో జాగ్రత్త -- * అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ రాండల్ జీ ష్రీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 30: ఉగ్రవాద సంస్థలకు నిలయంగా ఉన్న పాకిస్తాన్‌కు భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా అవకాశం ఇస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. పాక్ కొత్త అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వైఖరి, వేసే అడుగులను పరిశీలించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింద. గతంలో పాకిస్తాన్‌లో అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని హామీ ఇచ్చేవని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా పట్ల పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. కాని ఎప్పటిలాగానే ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగానే మసులుకునేవి. ఇక్కడ ఆసియా, పసిఫిక్ భద్రతా వ్యవహారాలపై జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ జీ ష్రీవర్ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేవిధంగా అడుగులు వేస్తారని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. పాకిస్తాన్ పట్ల తమ ప్రభుత్వవైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిపివేత విధానాలు కొనసాగుతాయన్నారు. ఇమ్రాన్ ఖాన్ గత తప్పిదాలు పునరావృతం కాకుండా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు అవకాశం ఇస్తున్నామంటే, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను మార్చుతున్నట్లు కాదన్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్థిక సహాయం పొందుతున్న వైనంపై కూడా వివరాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చైనాకు అవకాశం ఇచ్చిన దేశాల పరిస్థితి ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందేనన్నారు. చైనాతో పాకిస్తాన్ అంతగా రాసుకునిపూసుకుని తిరగడం మంచిది కాదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. నిజంగా అభివృద్ధి కావాలంటే సరైన సలహాలు ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షికంగా, అంతర్జాతీయంగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాకిస్తాన్ సంపూర్ణ దేశంగా వ్యవహరించడంలో విఫలమవుతోందని, ఆ దిశగా పయనిస్తుందనే ఆకాంక్ష, ఆశ తమకు లేవన్నారు. పాకిస్తాన్ తన సార్వభౌమాధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని, చైనా ముందు సాగిలపడే విధంగా వ్యవహరించరాదని ఆయన కోరారు.