అంతర్జాతీయం

300 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడంలో పాకిస్తాన్ కలిసి రానందుకు ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల మేర ఆయుధ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా నిర్ణయించింది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ కలిసి రావడం లేదని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. హకానీ టెర్రర్ నెట్‌వర్క్, లష్కర్ తోయిబా కార్యకలాపాలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపాలని, వారిని ఏరిపారేయాలని అమెరికా పలుసార్లు కోరింది. అమెరికా విజ్ఞప్తిని పాకిస్తాన్ పాలకులు పెడచెవిన పెడుతున్నారు. పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అమెరికా సెక్రటరీ మైక్ పొంపియో రెండు రోజుల్లో కలవనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌తో అనుసరించాల్సిన వైఖరిపై అమెరికా రక్షణ శాఖ కసరత్తు చేస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అడ్డాగామారిందని, ఆఫ్గనిస్తాన్‌లో అస్థిరత్వం పెరిగేందుకు పరోక్షంగా సాయపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్ గత ఏడాది ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాకిస్తాన్ తీరుపట్ల గుర్రుగా ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది దక్షిణాసియాలో శాంతి సుస్థిరతల కోసం విధానాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ మాత్రం ఈ విధానం పట్ల స్పందించకుండా ఒంటెత్తు పోకడలను అనుసరిస్తోందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోకపోవచ్చని అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ నిధులను ఇతర ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్‌పై నిరంతరం వత్తిడి కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీపడేప్రసక్తిలేదని ట్రంప్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్నినిర్మూలించడానికి పాకిస్తాన్ కలిసి రావడంలేదని అమెరికా నిపుణులు పదే పదే తమ ప్రభుత్వన్ని హెచ్చరించారు.