అంతర్జాతీయం

జన్యుకణంతో హృదయ, రక్తప్రసరణ పనితీరు నిర్ధారణ పరిశోధనలో వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో, సెప్టెంబర్ 12: వ్యాయామానికి మన గుండె ఎలా స్పందిస్తుంది, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో మన జన్యుకణం ఆధారంగా నిర్ధారించవచ్చునని, అంతేకాకుండా దీని ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలపై ముందుగానే హెచ్చరించవచ్చునని ఒక పరిశోధన వెల్లడించింది. వ్యాయామం చేసినా దాని ఫలితం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఎందుకు ఉంటున్నదో ఇంతవరకు ఎవరూ పరిశోధనలు చేయలేదు. అయితే జన్యుపరమైన తేడాల వల్ల ఎముక సంబంధ నరాలు గ్రాహక విషయంలో భిన్నంగా స్పందిస్తాయని జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురితమైన పరిశోధక వ్యాసంలో పేర్కొన్నారు. మన శరీరంలోని కణాలు మన చుట్టూ ఉన్న వాతావరణం, ఇతర అంశాల మేరకు ప్రభావితమవుతుంటాయని, ఆ మేరకు అవి గ్రాహక శక్తిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఒకే కరమైన జన్యుకణాలు కలిగిన వ్యక్తుల్లో సైతం వ్యాయామం చేసినప్పుడు వారి హృదయ స్పందన, రక్త ప్రసరణ వేగంలో తేడా ఉండటాన్ని ఈ పరిశోధకులు గుర్తించారు.
కెనడాకు చెందిన గులెప్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మంది ఆరోగ్య వంతమైన యువతీయువకులపై ఈ పరిశోధన నిర్వహించారు. వారితో హేండ్ గ్రిప్ ఎక్స్‌ర్‌సైజ్ చేస్తున్నప్పుడు, చేయకముందు వారి నాడి, డిఎన్‌ఏని విశే్లషించారు. జన్యుపరమైన తేడాల వల్ల కంకాళ సంబంధమైన నరాల గ్రాహకం వేర్వేరుగా కన్పించింది. తాము ఈ వ్యాయామం చేసిన సమయంలో ఎక్కువగా రక్త ప్రసరణ జరిగిందని, దీనిద్వారా భవిష్యత్‌లో సంభవించే హృద్రోగ, నరాల సంబంధ సమస్యలను కనిపెట్టవచ్చునని పరిశోధనకు నాయకత్వం వహించిన ఫిలిప్ జె మిల్లర్ తెలిపారు. ముఖ్యంగా వేర్వేరు జన్యువులు హృదయ స్పందన, రక్తప్రసరణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నదానిపై తాము పరిశోధన చేసినట్టు ఆయన చెప్పారు.