అంతర్జాతీయం

యూఎస్‌తో చర్చలకు తాలిబన్లు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబల్, సెప్టెంబర్ 12: అమెరికాతో చర్చలకు తాలిబన్లు సిద్ధంగా ఉన్నారు. ఇది వరకే లాంఛన ప్రాయంగా జరిగిన చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత బలపరిచే విధంగా రెండో దఫా చర్చల కోసం తాము వేచి చూస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని తాలిబన్ ప్రతినిధి వెల్లడించాడు. ఆసియా ప్రాంతానికి అమెరికా అత్యున్నత దౌత్యాధికారిగా సేవలు అందిస్తున్న అలీస్ వెల్స్ ఈ ఏడాది జూలై మాసంలో తాలిబన్లతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా, పరస్పర అవగాహనతో బందీల విడుదల వంటి అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తాలిబన్ ప్రతినిధి పేర్కొన్నాడు. ఆ సమయంలోనే సెప్టెంబర్ మాసంలో మరోసారి సమావేశమై, చర్చలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పాడు. ఈ నెలాఖరులోగా మరోసారి యమెరికాతో చర్చలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశాడు. ఇలావుంటే, అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి అమెరికా భారీ యుద్ధం చేసిన విషయం తెలిసిందే. అప్పటి తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించే వరకూ సంకీర్ణ దళాలు అఫ్గాన్‌లోనే ఉన్నాయి. ఆతర్వాత దశల వారీగా సైన్యాన్ని అమెరికా ఉపసంహరించింది. ఇలావుంటే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, తాలిబన్లతో చర్చలు జరిపి, వారి వద్ద బందీలుగా ఉన్న తమ జవాన్లను విడిపించుకోవాలని అమెరికా యోచిస్తున్నది. అందుకే తొలి విడత చర్చలను పూర్తి చేసింది. మలివిడత చర్చలు ఈ నెలాఖరులోగా జరుగుతాయని అంటున్నారు.