అంతర్జాతీయం

అప్పులు తీర్చడానికి నేను సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 12: తమ రుణదాతలకు ఎలాంటి నష్టం కలుగకుండా తాను ఒక సమగ్ర పరిష్కార మార్గాన్ని కర్నాటక హైకోర్టుకు ఇదివరకే తెలియజేశానని, దానికి కోర్టు సానుకూలంగా స్పందిస్తే తనకున్న అప్పులన్నీ తీర్చివేయవచ్చునని, వేల కోట్ల రుణఎగవేత కేసును ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బుధవారం తెలిపారు. రుణఎగవేత కేసు విచారణ నిమిత్తం వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు భారత్ అధికారులు పంపిన ముంబయి జైలు సెల్ వీడియోను జడ్జి పరిశీలించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. ‘అప్పులు తీసుకున్న మాట వాస్తవమే.. నా అప్పులన్నీ తీర్చివేయడానికి నేను సిద్ధమే.. దీనిపై నేను సానుకూలంగా ఉన్నాను. గౌరవనీయ జడ్జీలు నా ప్రతిపాదనను సానుకూలంగా తీసుకుంటారని భావిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని మాల్యా 2016లో లండన్ పారిపోయారు. దీనిపై భారత్‌లో ఆయనపై కేసులు నమోదు కాగా, దీనికి సంబంధించి మాల్యా, యూనైటెడ్ బ్రివరీస్ కార్పొరేషన్ ఈ ఏడాది జూన్ 22న కర్నాటక హైకోర్టుకు దరఖాస్తు చేశారు. తమకు సంబంధించి 13,900 కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని కోర్టు పర్యవేక్షణలో అమ్మడానికి అనుమతించి తాను బాకీపడ్డ బ్యాంకులు, ఇతర రుణదాతలకు చెందిన తొమ్మిది వేల కోట్ల రుణాలను తీర్చివేయడానికి అంగీకరించాలని ఆయన కోర్టును కోరారు. ఇలావుండగా రుణాలను చెల్లించకుండా లండన్ పారిపోయిన మాల్యాను తమకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై వచ్చిన ఆయనపై లండన్ కోర్టులో గత ఏడాది డిసెంబర్ నాలుగు నుంచి దోషి అప్పగింతపై విచారణ జరుగుతోంది. మరోపక్క బ్యాంకుల కన్సార్టియం, ఇతరుల నుంచి తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలను తీసుకుని పరారైన మాల్యాపై చర్య కోరుతూ ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వేసిన కేసు వారికి అనుకూలంగా వచ్చింది. దీంతో మాల్యాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను స్తంభింపజేయవచ్చునని హైకోర్టు పేర్కొంది. యూకె హైకోర్టు ఎన్‌ఫోర్సుమెంట్ సైతం దీనికి అంగీకరించడంతో లండన్ సమీపంలోని హెర్ట్ఫోర్డ్ షైర్‌లోని మాల్యా భవనంలోకి భారత్ అధికారులు ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఇలా అన్ని వైపుల నుంచి మాల్యాపై ఉచ్చు బిగుసుకుంటుండటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లండన్ కోర్టులో ఆయనకు ప్రతికూలంగా తీర్పు వస్తే ఆయన భారత్‌లోని జైలుకు వెళ్లాల్సి వస్తుంది.