అంతర్జాతీయం

పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 15: పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని, ఇందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని పర్యావరణంపై ఇక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. ‘మనం మారితీరాలి’ అని సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు స్పష్టం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు అమెరికాలోని వివిధ నగరాల నుంచి మేయర్లు, గవర్నర్లు, పారిశ్రామికవేత్తలు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన సెలబ్రిటీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోరే మాట్లాడుతూ మూడు రోజుల ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. కాలుష్యం హద్దులుదాటుతున్నదని గుర్తుచేశారు. ప్రతి రోజూ సుమారు 110 మిలియన్ టన్నుల ఉద్ఘారాలు ప్రపంచంలోని వివిధ నగరాల నుంచి వెలువడుతూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇటీవల కాలంలో కొన్ని దేశాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన గుర్తుచేశారు. విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వినియోగించడం వంటి చర్యలతో కాలుష్య సమస్యను కొంత వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. భారత్‌కు చెందిన దాల్మియా సిమెంట్ లిమిటెడ్ సీఈఓ మహేంద్ర సింగ్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ బొగ్గు, చమురు, గ్యాస్ కంపెనీల్లో పెట్టుబడులను తగ్గించుకోవాలని మదుపరులను కోరారు. ఇలావుంటే, పారిస్‌లో 2015లో జరిగిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించారు. కాలుష్యాన్ని నియంత్రీకరించకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని సదస్సుకు హాజరమైన 196 దేశాల ప్రతినిధులు ముక్తకంఠంతో ప్రకటించారు. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సులు, సభలు విస్తృతంగా జరుగుతున్నాయి. అందులోభాగంగానే శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రపంచ పర్యావరణ నియంత్రణ సదస్సును నిర్వహించారు.