అంతర్జాతీయం

క్షయ నిర్మూలనకు సమగ్ర ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి (న్యూయార్క్), సెప్టెంబర్ 15: ప్రాణాంతకమైన క్షయ (టీబీ) వ్యాధిని ప్రపంచ దేశాల నుంచి శాశ్వతంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తీర్మానించింది. ఈనెల 26న జరిగే అంతర్జాతీయ టీబీ శిఖరాగ్ర సమావేశానికి ముందే ఒక అవగాహనకు రావలన్న ఉద్దేశంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. అన్ని కోణాల్లోనూ సమస్యను చర్చించిన తర్వాత, టీబీని పారద్రోలేందుకు అమెరికా నేతృత్వంలో ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమవేశంలో పాల్గొన్న యూఎన్ సభ్యదేశాలు తీర్మానించాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే క్షయను సమర్థంగా అదుపు చేసినప్పటికీ, చాలా దేశాల్లో, ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్నది. ఉష్ణమండల వ్యాధుల్లో అత్యంత వేగంగా విస్తరించే గుణం, తీవ్ర ప్రభావం చూపి మనిషిని మరణానికి చేరువచేసే తత్వం క్షయ వ్యాధికి ఉన్నాయని సమావేశం గుర్తుచేసింది. దీనిని నిర్మూలించడమే ప్రపంచ దేశాల ప్రధాన లక్ష్యం కావలని పిలుపునిచ్చింది. మేధా సంపత్తి హక్కుల్లో వాణిజ్య సంబంధమైన అంశాలు (ట్రిప్స్)ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. కాగా, తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఔషధాలు లభించకుండా అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్ లాబీ కట్టడి చేస్తున్నదని ఆఫ్రికా దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి. టీబీసహా ఉష్ణ మండల వ్యాధులకు మందులను సరఫరా చేయడం ద్వారా అమెరికా ఏటా 13 బిలియన్ డాలర్ల మేరకు లిబ్ధి పొందుతున్నదని ఆఫ్రికా దేశాలు పేర్కొన్నాయి. అయితే, అమెరికాసహా అన్ని దేశాలు టీబీ నిర్మూలనకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని, 26వ తేదీ నాటి సదస్సుకు హాజరుకావాలని ఈ సమావేశం తీర్మానించింది.