అంతర్జాతీయం

33శాతం కోటాకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, సెప్టెంబర్ 21: సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించే విషయంలో ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉద్ఘాటించారు. చట్టాల కంటే కూడా సమాజంలో మార్పు తేవడానికి మనుషుల ఆలోచనల్లో పరివర్తన రావడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలలో కేవలం రెండు పార్లమెంట్లలోనే 55 శాతానికి పైగా మహిళల ప్రాతినిధ్యం ఉందని గుర్తు చేసిన సోనియా గాంధీ ‘ప్రపంచంలోని జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం 25 శాతం కంటే తక్కువే’ అని అన్నారు. అలాగే ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే మహిళల ప్రాతినిధ్యం కనీస స్థాయిలోనే ఉందని శుక్రవారం నాడిక్కడ జరిగిన రెండో యురేషియా మహిళా ఫోరం సమావేశంలో సోనియా తెలిపారు. పని స్థలాల్లోనూ, కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించే సానుకూల వాతావరణానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఇందుకు మహిళలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అయితే, సమాజంలో ఈ రకమైన మార్పు రాత్రికి రాత్రే వచ్చే అవకాశం లేదని, మహిళలకు సమాన హక్కుల విషయంలో ప్రగతిశీల ఆలోచనలు కలిగిన పురుషులతో కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని సోనియా సూచించారు. భారత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపచేయడానికి తమ పార్టీ కృతనిశ్చయంతో ఉందన్నారు. భారత దేశంలో మహిళల సమాన హక్కుల సాధనకు ఇది అత్యంత కీలకమయిన ప్రయత్నమే అవుతుందని సోనియా స్పష్టం చేశారు. అయితే, కేవలం చట్టాల వల్లే ప్రపంచ సమాజంలో మార్పు రాదని, ఇందుకోసం ప్రతి ఒక్కరు గుణాత్మక రీతిలో కృషి చేయాలని కోరారు.