అంతర్జాతీయం

వచ్చే వారమే ఐరాస సర్వసభ్య సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి: వచ్చే వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సిరియా, యెమెన్‌లో అల్లకల్లోలంతో పాటు పర్యావరణం-వాతావరణ మార్పులు, వివిధ దేశాల్లో చోటు చేసుకుంటున్న శాంతి సాధనకు తీసుకుంటున్న చర్యలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరెస్ శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, పర్యావరణం తదితర రంగాల్లో నిర్దేశించిన విధానాల అమలుకు ప్రపంచదేశాలు కట్టుబడి ఉండే విధంగా తీర్మానాలు ఉంటాయన్నారు. 73వ ఐరాస సమావేశం ఈ నెల 18వ తేదీన లాంచనంగా ప్రారంభమైంది. సర్వసభ్య సమావేశంలో అనేక అంశాలపై ఈ నెల 25వ తేదీన చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రతిదేశానికి చెందిన ప్రతినిధి లేదా అధినేత మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 25వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఉపన్యసిస్తారు. ఆ తర్వాత ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్, బ్రెజిల్, భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగిస్తారు. భారత్‌కు ఈ నెల 29న మాట్లాడేందుకు అవకాశం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతికి కలుగుతున్న విఘాతం తొలగించేందుకు చర్యలు, భద్రత పరమైన సవాళ్లపై దృష్టిసారించనున్నారు. ఇటీవల టర్కీ, రష్యా అధ్యక్షులు ఇడిలిబ్ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకున్న చొరవను ఐరాస ప్రశంసించింది. దీని వల్ల ఈ ప్రాంతంలో ప్రజలను యుద్ధ విపత్తుబారి నుంచి రక్షించినట్లవుతుందని ఐరాస పేర్కొంది. పౌరుల భద్రతకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యనివ్వాలని కోరింది. ఉగ్రవాదం ముప్పును సమిష్టిగా ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు ఏకతాటిపైకి రావాలన్నారు. మానవ హక్కులు, ప్రజారోగ్యం, నిలకడతోకూడిన అభివృద్ధి, శాంతి, భద్రత, సమానత్వం తదితర అంశాలపై చర్చించేందుకు అజెండాను సిద్ధం చేశారు. 24న అభివృద్ధి, 25న లెస్బియన్లు, ట్రాన్స్‌జెండర్లు, లెస్బియన్ల సమస్య, 26న క్షయ నిర్మూలనపై చర్చిస్తారు.