అంతర్జాతీయం

త్వరలోనే కిమ్‌ను కలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 25: త్వరలోనే ఉత్తర కొరియా అధినేత కిమనన్ జాంగ్‌తో రెండవ విడత చర్చలు జరపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. అణు నిరాయుధీకరణపై ఇటీవల సింగపూర్‌లో చర్చల జరిపామన్నారు. ఈ చర్చల అమలు ఎంతవరకువచ్చిందనే అంశంపై వచ్చే సమావేశంలో కూలంకషంగా మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు. కొరియా ద్వీపకల్పంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొనే దిశగా అమెరికా నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు సింగపూర్‌లో శిఖరాగ్ర చర్చలు జరిపిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ భేటీకి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. కాని ఈ సందర్భంగా జరిగిన చర్చల వల్ల ఇంతవరకు సాధించింది శూన్యమనే విమర్శలు ఉన్నాయి. రెండవ విడత చర్చలు జరిగేందుకు అనువైన ప్రదేశం కోసం కసరత్తు జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ట్రంప్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మూన్ జా ఇన్ తో మాట్లాడారు. ట్రంప్ విలేఖర్లతో ముచ్చటిస్తూ పై అంశాలను వెల్లడించారు. కిమ్ పారదర్శకంగా వ్యవహరించారని, అరమరికలు లేకుండా మాట్లాడుకున్నామన్నారు. గత ఏడాది ఇదే సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ కిమ్‌పై విరుచుకుపడ్డారు. కిమ్ ఒక రాకెట్ మ్యాన్ అని, ఉత్తరకొరియా తమ దారికి రాకపోతే నాశనం చేస్తామని కూడా బెదిరించారు. ట్రంప్ మానసికస్థితి బాగాలేదని ఉత్తరకొరియా అప్పట్లో ఘాటుగా స్పందించింది. ఇటీవల మూన్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలిశారు. ఈ విశేషాలను ట్రంప్‌కు వివరించారు. సింగపూర్ చర్చల తర్వాత దక్షిణ, ఉత్తర కొరియా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. మిసైళ్ల పరీక్షను ఉత్తరకొరియా నిలుపుదల చేసింది. మిసైళ్ల పరీక్షల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దశాబ్ధాల తరబడి కొనసాగుతోంది. ఉత్తర కొరియాతో సత్సంబంధాల కోసం తాపత్రయపడుతున్నారని, కాని ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయంగా దేశాలు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.