అంతర్జాతీయం

ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తొక్కేసిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, సెప్టెంబర్ 26: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమం దాదాపు తగ్గుముఖం పట్టింది. చైనా ఆధీనంలోకి హాంకాంగ్ వెళ్లిపోయిన కొత్తల్లో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాలని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. చైనా మాత్రం కొన్ని రోజులు ఓపిక పట్టినట్లు పట్టి ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని అణచివేసింది. ఈ రోజు ఏమి మాట్లాడితే ఏమవుతుందనే భ యం ప్రజలను పట్టి పీడిస్తోంది. పౌర హక్కు ల ఉల్లంఘన బాహాటంగా జరుగుతోంది. నాలుగేళ్ల క్రితం 2014లో హాంకాంగ్‌లో కళాకారులు, ఉద్యమకారులు ప్రజాస్వామ్య వ్యవస్థను హాంకాంగ్‌లో నెలకొల్పాలని కోరుతూ ఉద్యమించారు. దీనికి చిహ్నంగా గొడుగు గుర్తును విస్తృతంగా వాడారు. గొడుగులతో అనేక కళాఖండాలను తయారు చేశారు.తమ వాణిని వినిపించేందుకు గొడుగు సింబల్ పా పులరైంది. ప్రపంచ దృష్టిలో హాంకాంగ్ అంబ్రి ల్లా ( గొడుగు) ఉద్యమానికి విశిష్ట గుర్తింపు లభించింది. పాలకుల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు గొడుగును ఆయుధంగా వినియోగించుకున్నారు. ఈ రోజు ఈ గొడుగు కళాఖండాలు బ్రిటన్ మ్యూజియంకు చేరుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ర్యాలీలు కూడా హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టాయి. నాలుగేళ్ల క్రితం సెప్టెంబర్ 28వ తేదీన హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ ప్రజలు కదం తొక్కారు. వాణిజ్య, పారిశ్రామిక కూడలి అయిన హాంకాంగ్‌లో 2014 సెప్టెంబర్ 28వ తేదీ అన్ని కార్యకలాపాలు స్తంభించాయి. హాంకాంగ్‌ను చైనాలో విలీనం చేసిన తర్వాత పాక్షిక స్వయంప్రతిపత్తిని మాత్రం కల్పించారు. ప్రజాస్వామ్యవాదులను అణచివేసేచర్యలను తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో నేతలను అరెస్టు చేశారు. దీంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కీలకంగా ఉపయోగపడిన గొడుగు కళాఖండాలను బ్రిటన్ మ్యూజియంకు పంపడం మేలని భావిస్తున్న ట్లు ఫాంగ్ అనే కళాకారుడు, కార్యకర్త చెప్పా రు. హాంకాంగ్‌లో వాతావరణం బాగాలేదని, రాజకీయ నిర్బంధం పెరిగిందన్నరు. రాజకీయంగా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించిన సాహిత్యంపై నిషేధం విధించారన్నారు. ప్లకార్డులు, బ్యాగ్‌లు, నగలు, గాలిపటాలు, శిల్పాలు అన్నింటినీ గొడుగు ఆకారంలో మలిచారు. వీటిని 12 అడుగుల ఎత్తున వుడెన్ మ్యాన్ విగ్రహాన్ని కూడా చెక్కా రు. భవిష్యత్తు తరాలకు హాంకాంగ్ ప్రజాస్వామ్య ప్రియుల ఆకాంక్షను తెలియచేసేందుకు ఈ గుర్తును భద్రపరచనున్నట్లు అకడమిక్ దాన్ సాంగ్ చెప్పారు.