అంతర్జాతీయం

కాశ్మీర్ అంశంపై అమెరికా చొరవ తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 29: అంతర్గత రాజకీయ వత్తిళ్ల వల్లనే భారత్ పాకిస్తాన్‌తో చర్చలకు ముందుకు రావడం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. దేశీయంగా రాజకీయ వత్తిళ్లు, ఎన్నికల నేపథ్యంలో పాక్‌తో చర్చలను భారత్ రద్దు చేసిందన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలు రద్దయిన విషయం విదితమే. కాశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో భారత్ పాక్‌తో చర్చలను రద్దు చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాక్‌తో చర్చలకు విముఖత కనపరిచారని ఆయన భారత్‌ను దుయ్యబట్టారు. ఆసియా సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే చర్యలను నిలుపుదల చేయనంత వరకు పాక్‌తో చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ, నేను, సుష్మాజీ ఒకరిని చూసి ఒకరు చిరునవ్వులు ఎటూ చిందించుకోవాలని కోరుకుంటాం. సుష్మాజీ ముఖంలో వత్తిడి కనపడుతోంది. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె ఆసక్తిని కనపరచడం లేదు. రాజకీయ వత్తిడితో ఆమె ఉన్నారు. దేశీయ రాజకీయాల వల్లనే ఈ చర్చలు రద్దయ్యాయి అన్నారు. ఈ రోజు అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని ఈ విషయమై తామేమీ బాధపడడం లేదన్నారు. పాకిస్తాన్ అమెరికాకు బాసటగా నిలిబడినప్పుడల్లా ఆ దేశం లాభపడిందన్నారు. పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వంతో అమెరికా చేదోడువాదోడుగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దక్షిణాసియాలో శాంతి వికసించాలని కోరుకుంటున్నామన్నారు. కాశ్మీర్ అంశంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగాలని అమెరికా కీలకపాత్రవహించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భారత్-పాకిస్తాన్ దేశాలు పరస్పరం ప్రయోజనాలు సాధించే విధంగా సంబంధాలు ఉండాలని ఆయన కోరారు.