అంతర్జాతీయం

జపాన్ అల్లకల్లోలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిబూషీ (జపాన్), సెప్టెంబర్ 29: జపాన్‌కు దక్షిణ ప్రాంతంలోని ద్వీపంలో శనివారం శక్తివంతమైన పెనుతుపాను అల్లకల్లోలం సృష్టించింది. ఈ తుపాను తాకిడికి 17 మంది గాయాలయ్యాయి. ఈ వారంతం వరకు ఈ పెనుతుపాను, గాలుల తీవ్రత సాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. టైఫూన్ ట్రామీ అంటే పెనుగాలులతో కూడిన తుపాను సమయంలో గంటకు 134 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల ఆదివారం, సోమవారం పర్యావరణం, ప్రజాజీవితంపైన ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడనున్నాయి. కాగా శనివారం పెనుగాలుల వల్ల ఎక్కడిపడితే నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. ఒకినావా ప్రాంతంలో 700 మందిని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20వేల ఇళ్లకు కరెంటును కట్ చేశారు. పశ్చిమ జపాన్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. పెనుతుపాను, గాలుల వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రకృతితో శక్తికి మించి పోరాడలేమని, ఎవరి జాగ్రత్తలో వారుండాలని జపాన్ అధికారులు ప్రజలను కోరారు. పెనుగాలులు, తుపానుల వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఈ నెలలో హొక్కాడో ద్వీపంలో భూకంపం వల్ల 40 మంది మరణించిన విషయం విదితమే.