అంతర్జాతీయం

ఇండోనేషియాలో సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలూ, సెప్టెంబర్ 29: భారీ భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడక ముందే, సునామీ పలూను ముంచెత్తింది. భూకంపానికి అతలాకుతలమైన ఇండోనేషియా నగరం పలూ 24 గంటల కూడా గడవక ముందే సునామీలో చిక్కుకొని విలవిల్లాడింది. ఇప్పటివరకూ 384 మంది మృతి చెందారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. సుమారు 3,50,000 మంది నిరాశ్రయులుకాగా, ఇండోనేషియా సర్కారు వారిని ఆదుకోవడానికి సహాయక చర్చలను ముమ్మరం చేసింది. పలూ నగరంలోనే సునామీ అలలు ఐదు అడుగుల వరకూ ఎగసిపడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇండోనేషియాలోని సలావెసీ వద్ద సునామీ విరుచుకుపడగా, దానికి సమీపంలో పలూలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. సునామీ వల్ల భారీగా నష్టపోయింది. వేలాదిగా చేరుతున్న క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది పరుగులు తీసుకున్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, దీనివల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇండోనేషియా జాంతీయ విపత్తు ఏజెన్సీ ప్రకటించింది. కాగా, సముద్రం ఒడ్డున పదుల సంఖ్యలో శవాలు పడివున్నాయని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రుల్లో చేరుకున్న వారి సంఖ్య గంటగంటకూ పెరుతుండగా, చాలా మందికి ఆవరణల్లోనే చికిత్సను అందచేస్తున్నారు. ఇలావుంటే, చాలా వందలాది మంది జాడ లేకుండా పోవడంతో, వారి కోసం సంబంధింత కుటుంబీకులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఆసుపత్రికీ వెళ్లి, మృతులు లేదా క్షతగాత్రుల్లో తమవారు ఉన్నారేమోనని వెతుకుతున్నారు. అక్కడ ఎవరూ కనిపించకపోతే, వీధులను జల్లెడ పడుతున్నారు. సలావెసీ, పలూతోపాటు మత్స్యకారులు ఎక్కువగా ఉన్న డొంగాలా పట్టణం కూడా సునామీ వల్ల భారీగానే నష్టపోయింది. తీవ్రమైన భూకంపం తాకిడే ఈ తాజా సునామీకి కారణమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, మందులు, ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ సాయం కోసం సునామీ బాధితులు ఎదురుచూస్తున్నారు.