అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని తొక్కేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 30: ప్రపంచంలో ఉగ్రవాదం పీచమణించేందుకు జరుగుతున్న యుద్ధంలో భారత్ కీలక భాగస్వామి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ అన్నారు. ఉగ్రవాదమనే పెనుభూతాన్ని నిర్మూలించకపోతే అభివృద్ధి సాధించలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై రాజీలేకుండా పోరాడే దేశాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. దీని వల్ల ఉగ్రవాదాన్ని తరిమిగొట్టడం సాధ్యమవుతుందన్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఉగ్రవాదం సరిహద్దులు దాటి అన్ని దేశాలను పట్టిపీడిస్తోందన్నారు. ఎల్లలులేకుండా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా అణచివేయాలన్నారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొత్త రూపం దాల్చుతున్న ఉగ్రవాదం అనేక అవతారాల్లో ప్రత్యక్షమవుతోందన్నారు. ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలన్నారు. సామాజకిక మాద్యమాలు, టెక్నాలజీని ఉగ్రవాదులు వాడుకుంటున్నారన్నారు. యువకుల్లో దేశం, సమాజం అంటే ద్వేషభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. యువతను రిక్రూట్ చేసి వారిని పెడత్రోవపట్టించే విధంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. హింస అభివృద్ధిని నిరోధిస్తుందన్నారు. ఈ హింస ఏ రూపంలో ఉన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో తుదముట్టించేందుకు కౌంటర్ టెర్రరిజం ఎత్తుగడలు అవసరమన్నారు. హింసాత్మక తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తిలేదన్నారు. మానవాళికి తీవ్రవాదం చేసే హానీ అంతా ఇంతా కాదన్నారు. ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని, వీటిపై కన్నువేసి ఆర్థిక మార్గాలకు చెక్‌పెట్టాలన్నారు. ఐరాస అంతర్జాతీయ కౌంటర్ టెర్రరిజం ఉగ్రవాదంపై పోరుకు బాసటగానిలుస్తుందన్నారు. భారతదేశం కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలకు అండగా నిలబడిందన్నారు. కౌంటర్ టెర్రరిజంకు భారత్ ఈ ఏడాది 55000 మిలియన్ డాలర్ల ఆర్థికసహాయాన్ని ప్రకటించిందన్నారు. ఇటీవలనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కౌంటర్ టెర్రరిజం విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వ్యూహాత్మక ఎత్తుగడలు, సమన్వయం, సహకారం ద్వారా ఉగ్రవాదులు ఆట కట్టించవచ్చన్నారు. ప్రపంచదేశాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందిస్తామన్నారు. నిఘాను పెంచుకోవాలని, ఆధునీకరణ, సమాచార సేకరణ, ఉగ్రవాదుల కదలికలను పసిగట్టే వ్యవస్థను పెరుగుపరుచుకోవాలన్నారు. ఉగ్రవా దం ప్రపంచాభివృద్ధికి అడ్డని, ప్రజలను తీవ్రవాద ఉన్మాదానికి బలవుతున్నారని ఆయన అన్నారు.