అంతర్జాతీయం

ఆఫ్గాన్‌లో చెలరేగిన ఎన్నికల హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బుధవారం రాత్రితో ముగియనున్న ప్రచారం
కాందహార్ (ఆఫ్గనిస్తాన్), అక్టోబర్ 17: ఆఫ్గనిస్తాన్‌లో పార్లమెంటు ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు మొత్తం పదిమంది అభ్యర్థులను తాలిబన్లు హతమార్చారు. తాజాగా సోఫాకింద అమర్చిన ఓ బాంబు పేలడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి సహా నలుగురు వ్యక్తులు మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ నెల 20న అక్కడ జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిమంది అభ్యర్థులు ఇలా అకాల మృత్యువుపాలయ్యారు. తీవ్రవాద తాలిబన్లకు మంచి పట్టువున్న దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్ ప్రాంతంలోని లష్కర్‌గాహ్‌లో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి అబ్దుల్ జబ్బార్ క్వాహ్రామన్ తన అనుచరులతో ప్రచార కార్యాలయంలో సమావేశంమై చర్చిస్తున్న తరుణంలో సోఫాకింద రహస్యంగా అమర్చిన బాంబు పేలిందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో క్వాహ్రామన్‌తోబాటు అతని అనుచరులు ముగ్గురు మృతిచెందారని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వయిస్ అహ్మద్ బరాక్ తెలిపారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారన్నారు, ఘటనకు కారకులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు. 2016లో హెల్మండ్ ప్రాంతంలో తాలిబన్లను ఓడించేందుకు క్వాహ్రామ్‌ను దూతగా ప్రభుత్వం పంపించింది. ఆ సమయంలో ఆయనపై దాడి జరగ్గా తర్వాత ఆయన ఆపదవికి రాజీనామా చేశారు. కాగా క్వాహ్రామ్‌పై ఇలా తాలిబన్లు దాడిచేయడం దారుణమని దేశాక్షుడు అష్టఫ్ గని పేర్కొన్నారు. కాగా ఎన్నికలకు సంబంధించిన మరో హింసాయుత ఘటన కాబూల్ సమీపంలోని లోగర్ ప్రావిన్స్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి కాన్వాయ్‌పై సాయుధులు దాడి చేశారని గవర్నర్ అధికార ప్రతినిధి షమ్షద్ లరావే తెలిపారు. అలాగే లోగార్ ప్రావిన్షియల్ క్యాపిటల్ పులే ఆలమ్‌లో ఓ అభ్యర్థి నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీకి సమీపంలో శక్తివంతమైన బాంబు పేలుడు జరిగిందని, ఈ రెండు ఘటనల్లో ఎవ్వరూ గాయపడలేదని లరావై చెప్పారు, ఎన్నికల అధికారిక ప్రచార కార్యక్రమం బుధవారం రాత్రితో ముగుస్తుందని ఆయన తెలిపారు. ఇలావుండగా ఈ దేశంలో చెలరేగిన ఎన్నికల హింసలో మృతిచెందిన పదిమంది అభ్యర్థులను ప్రత్యర్థులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హతమార్చారని తేలింది. ఒక్క లష్కర్ ఘాలో మాత్రమే క్వాహ్రామన్ సహా ఇద్దరు అభ్యర్థులు హతమయ్యారు. గత నెలలో ఓ మానవబాంబు దాడిలో ఇక్కడ ఎన్నిమిది మంది మృతిచెందగా అందులో సల్హేమహ్మద్ ఆసిక్‌జాయ్ అనే అభ్యర్థి కూడా ఉన్నారు. ఎన్నికల నుంచి తప్పుకోవాలని తాలిబన్లు అభ్యర్థులను హెచ్చరించిన ఒక రోజు వ్యవధిలోనే ఈ హింసాకాండ చోటుచేసుకోవండం గమనార్హం. కాగా పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా చేయడాన్ని విద్యావంతులు అడ్డుకోవాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొనరాదని తాలిబన్లు బుధవారం నాడొక ప్రకటనలో హెచ్చరించారు, ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ సందర్భంగా పోలింగ్ నెమ్మదిగా జరగడంతో అక్కడ ఓట్లు వేయడానికి జనం గుమికూడిన సందర్భాల్లో చోటుచేసుకున్న హింస కారణంగా వందలాది మంది అమాయక ప్రజలు అశువులుబాయగా, అనేకమంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ దేశంలోని సుమారు ఐదు వేల పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని సరఫరా చేయడంలోప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటు దిగువ సభలకు గత ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకుంటామని, వచ్చే నవంబర్‌లో జనీవాలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగనున్న దృష్ట్యా ఈ ఎన్నికల నిర్వహణ ఓ మైలురాయి కానుందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యా విధానాన్ని చాటేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నామన్నారు. తొమ్మిది మిలియన్ల మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఎంతమంది వినియోగించుకుంటారన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.