జాతీయ వార్తలు

సరిహద్దులు ఇక శత్రుదుర్భేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బికనేర్, అక్టోబర్ 19: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేస్తున్నట్టు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాంప్రహెన్సీవ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఐబీఎంఎస్)కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన వెల్లడించారు. సరిహద్దుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయన తెలిపారు. జమ్మూలో సీఐబీఎంఎస్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘సరిహద్దులో కంచె దగ్గర నుంచి అన్నింటా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉమయోగించుకోనున్నాం. మొత్తం సరిహద్దు భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం’అని ఆయన తెలిపారు. విజయదశమి సందర్భంగా జరిగిన ఆయుధ పూజలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. సైనిక ఆయుధాలకు జరిగిన ఈ పూజలో ఓ సీనియర్ కేంద్ర మంత్రి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘ దేశ రక్షణకు బీఎస్‌ఎఫ్ జవాన్లు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయం. మీ కృషిని జాతి ఎప్పటికీ మరచిపోదు’అని అన్నారు.‘బీఎస్‌ఎఫ్‌లోనూ సీఐబీఎంఎస్‌ను అమలుచేయనున్నాం.దీనికి కొంత సమయం పడుతుంది. అది పూర్తిగా అమలయితే జవాన్లు రేయింబవళ్లూ సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉండనక్కర్లేదు. ఒక విధంగా బలగాలకు ఉపశమనం కలుగుతుంది’అని హోమ్‌మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో ఏం జరుగుతున్నదీ కమాండ్, కంట్రోల్ కేంద్రం నుంచే పర్యవేక్షించవచ్చని ఆయన చెప్పారు. సరిహద్దుల వెంబడి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎక్కడైనా చొరబాట్లు సమాచారం అందినా సమీపంలోని అవుట్‌పోస్ట్‌ను కమాండ్ కంట్రోల్ నుంచే అప్రమత్తం చేయవచ్చని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. బీఎస్‌ఎఫ్ జవాన్ల పేరుచెబితే పాక్ రేంజర్లు వణికిపోతారని ఆయన అన్నారు. సరిహద్దుల్లోనూ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ బీఎస్‌ఎఫ్ జవాన్లు చూపుతున్న తెగువ ఎంతో గొప్పదని సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం కవ్వింపుచర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోందని పొరుగుదేశంపై ఆయన నిప్పులు చెరిగారు. రాజస్థాన్ సరిహద్దుల్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన హోమ్‌మంత్రి బీఎస్‌ఎఫ్ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. సీఐబీఎంఎస్‌ను ఇండో-బంగ్లా సరిహద్దులోని ధుబ్రీ, అస్సాంలో అమలుచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ జవాను కుటుంబాన్ని రాజ్‌నాథ్ పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 3,323 కిలోమీటర్ల పొడవైన ఇండో-పాక్ సరిహద్దు అత్యంత సమస్యాత్మకంగా ఉంది. అయితే రాజస్థాన్ సరిహద్దులో మాత్రం శాంతియుత వాతావరణమే ఉంది. జమ్మూకాశ్మీర్ సరిహద్దులో మాత్రం నిత్యం కాల్పుల మోతలే. పెద్ద ఎత్తున ఆస్తులు, ప్రాణనష్టం జరుగుతోంది. గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని జోషిమాత్‌లో జరిగిన శాస్తప్రూజలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.