అంతర్జాతీయం

చైనాలో పురావస్తు తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 31: చైనాలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 8400 నుంచి 7800 సంవత్సరాల క్రితం నాటి 16 గ్రామాల్లో ఆ నాటి శిథిలమైన ఇండ్లు, మానవులు ఉపయోగించిన వస్తువులు బయల్పడ్డాయి. ఈ వివరాలను చైనా మీడియా వెల్లడించింది. ఉత్తర చైనాలో మంగోలియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఈ ప్రాచీన అవశేషాలు కనుగొన్నారు. చైనాలోని యుమిన్ నాగరికతకు సంబంధించిన శిథిలాలను 2014లో చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా కనుగొన్నారు. ఈ ఇండ్లు గుండ్రంగా ఉండేవని, మరి కొన్ని చతుర్భజాకారంలో ఉన్నాయని తెలిపారు. 3.3 మీటర్లు నుంచి 4.5 మీటర్ల వ్యాసంలో ఇంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు వందల వస్తువులను కనుగొనర్నారు. వీటిల్లో రాతి చిప్పలు, రాతి వంట సామాగ్రి, ఎముకలతో తయారు చేస్తున్న వస్తువులు, మట్టితో తయారు చేసిన వస్తువులు, జంతువుల ఎముకలు కనుగొన్నారు. ఆర్కియాలజిసుక్ట జియాంగాంగ్ మాట్లాడుతూ ప్రాచీన కాలంలో ఆ నాటి సమాజంలో ఈ వస్తువులను వేటకు ఉపయోగించేవారని అర్థమవుతుందని చెప్పారు. ఈ వస్తువులను సేకరించి యుమిన్ సాంస్కృతిక మ్యూజియంకు తరలించామన్నారు.