అంతర్జాతీయం

దిగొచ్చిన లంక అధ్యక్షుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రనీల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి సుప్తచేతనావస్థలో ఉంచారు. దీంతో విక్రమసింఘే పార్టీతోపాటు పలు రాజకీయ పక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. పరిస్థితిని చక్కదిద్దాలన్న ఉద్దేశంతో పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయనున్నట్టు అధ్యక్షుడు సిరిసేన గురువారం వెల్లడించారు. ఈ మేరకు అధికార ప్రకటన వెలువడింది. విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించి మహిందా రాజపక్సను అధ్యక్షుడు నియమించారు. అలాగే పార్లమెంట్‌ను ఈనెల 16 వరకూ సస్పెండ్ చేశారు. సిరిసేన నిర్ణయంపై అటు రాజకీయంగానూ, ఇటు దౌత్యపరంగానూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వత్తిళ్ల నేపథ్యంలో పార్లమెంట్‌పై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు లంక అధ్యక్షుడు ప్రకటించారు. ఈనెల 5న పార్లమెంటు సమావేశమవుతుందని రాజపక్స కార్యాలయం వెల్లడించింది. శ్రీలంక పార్లమెంట్‌లో విక్రమసింఘే నాయకత్వంలోని యూనైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి 106 మంది ఎంపీలున్నారు. రాజపక్స, సిరిసేన ఇద్దరికీ కలిసి 95 మంది సభ్యులున్నారు. యూఎన్‌పీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేరడంతో రాజపక్స బలం 101కు పెరిగింది. మరో యూఎన్‌పీ ఎంపీ రాజపక్సకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అయితే రాజపక్స పార్లమెంట్‌లో బలనిరూపణకు సరైన సంఖ్య ఇప్పటికిప్పుడు లేదని పరిశీలకులు పేర్కొన్నారు.