అంతర్జాతీయం

మీడియాకు విశ్వసనీయత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికాలో మీడియా తప్పుడు వార్తలను ప్రజలు అందిస్తోందని, నిరాధారమైన సమాచారం ఇస్తూ మీడియా ప్రజలకు శత్రువుగా మారిందని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. అమెరికా ప్రముఖ మీడియా సంస్థలు సీఎన్‌ఎన్, ఎబీసీన్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు తదితర మీడియా సంస్థలపై ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిప్పులు గక్కుతున్న విషయం విదితమే. తప్పుడు వార్తలు ఇచ్చే మీడియాకు విశ్వసనీయత ఉండదన్నారు. ఆయన పిట్స్‌బర్గ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ యూదు జాతీయులను ఒక శే్వతజాతీయుడు కాల్చి చంపిన విషయం విదితమే. ఈ ఘటనపై ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుల పక్షాన అమెరికా జాతి నిలబడుతుందన్నారు. ఈ విషాద ఘటనను కూడా మీడియా విభజన బీజాలు నాటేందుకు ఉపయోగించుకుంటోందన్నారు. మీడియా కథనాలను ప్రజలు నమ్మడం మానేశారన్నారు. ప్రజల్లో ప్రభుత్వమంటే వ్యతిరేకత పెంచేందుకు చేసే మీడియాను విశ్వసనీయత ఎక్కడిదన్నారు. తాను, తన వెంట ప్రథమమహిళ అయిన తన భార్య కలిసి పిట్స్‌బర్గ్‌ను సందర్శించామన్నారు. తన పాలనపై సత్యదూరమైన అంశాలను ప్రచారం చేయడం మీడియాకు అలవాటుగా మారిందన్నారు. ఉగ్రవాద శక్తులను ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. అమాయకులను చంపే ఉగ్రవాదులను నిర్మూలించే వరకు అమెరికా విశ్రమించదన్నారు. ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరిని అవలంభిస్తామన్నారు. అణ్వాయుధాలను స్వప్రయోజనాలకు వాడుకునే ఇరాన్ వైఖరిని ఎండగట్టామన్నారు. రెండేళ్ల క్రితం ఉన్న ఇరాన్‌కు, ప్రస్తుత ఇరాన్‌కు చాలా తేడా ఉందన్నారు. జాతి దురంహకారం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా అమెరికా అణచివేస్తుందన్నారు. అమెరికాలో 33 శాతం మంది తప్పుడు వార్తలను నమ్మేవారున్నారన్నారు. వామపక్ష భావాలు ఉన్న మీడియాకు సమస్యలను పరిష్కరించడం పట్ల ఆసక్తి ఉండదని, వారికి సంచలనాలు కావాలన్నారు. అమెరికాలో యువకులకు ఉపాధి కల్పించడం, శాంతి భధ్రతలను నెలకొల్పడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.