అంతర్జాతీయం

రోహింగ్యా ఉగ్రవాదుల ఊచకోత.. 99 మంది హిందువుల బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్, మే 23: మయన్మార్‌లో ఆ దేశ సైనికుల దాడికి భయపడి ఆ దేశంలో నివసిస్తున్న ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్, ఇతర దేశాలకు పారిపోయారని, అమాయకులైన రోహింగ్యాలపై ఇలాంటి దాడులు సరికావని ఇంతకాలం అంతర్జాతీయ సమాజం సానుభూతితో పేర్కొంటుండగా, దానిపై పరిశోధన చేసిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారిలోని క్రూరచర్యలను ప్రపంచానికి వెల్లడించింది. రోహింగ్యా ఉగ్రవాదులు రెండేళ్ల క్రితం పాల్పడిన దాష్టీకాన్ని అమ్నెష్టీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ తిరనా హాసన్ వివరించారు. రోహింగ్యా ఉగ్రవాదులుగా పేర్కొనే అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (అర్సా) మయన్మార్‌లోని రకినే ప్రాంతంలోని రెండు గ్రామాల్లో ఊచకోతకు పాల్పడి 99 మంది హిందువులను విచక్షణారహితంగా హత్య చేసిందని ఆయన వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బౌద్ధ ధర్మాన్ని అనుసరించే మయన్మార్‌లో 2017 ఆగస్టు 25న తమ పీడన విముక్తి కోసం ఆ దేశంలోని పోలీస్ పోస్టులపై రోహింగ్యాలు పెద్దయెత్తున దాడులకు దిగారు. దానిని ఆ దేశ దళాలు తిప్పికొట్టాయి. వారు రోహింగ్యాలపై ఎదురుదాడి చేశారు. వారి దాడులకు తట్టుకోలేక ఏడులక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్, ఇతర దేశాలకు పారిపోయారు. మయన్మార్ దేశ చర్యను ఐక్యరాజ్యసమితితో పాటు ఇతర దేశాలు ఖండించాయి. ఇది అనైతిక చర్య అని పేర్కొన్నాయి. దీంతో రోహింగ్యాలపై కొన్ని వర్గాలలో సానుభూతి వెల్లువెత్తింది. అయితే రోహింగ్యా ఆర్మీ ఆర్సా చేసి అరాచకాలు తక్కువేమీ కావని అమ్మెస్టీ జరిపిన పరిశీలనలో వెల్లడైంది.
ఆర్సాకు చెందిన ఉగ్రవాదులు కామాంగ్ సీక్ గ్రామంపై దాడి చేసి 53 మందిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. వీరిలో మహిళల, పిల్లలు సైతం ఉన్నారు. అదేవిధంగా దగ్గరలో ఉన్న మరో గ్రామం యెబాక్‌క్యార్‌లో 46 మంది హిందువులు అదృశ్యమయ్యారు. వారిని కూడా రోహింగ్యా మిలిటెంట్లు చంపి ఉంటారని భావిస్తున్నారు. ఎంతోకాలం నుంచి ఇక్కడ ఉంటున్న హిందూవులపై ద్వేషభావంతో రోహింగ్యాలు ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కామాంగ్ సీక్ గ్రామంలో రోహింగ్యా ఉవ్రాదుల దాడి నుంచి బయటపడ్డ వారిని ప్రశ్నించగా వారు పలు విషయాలను వ్లెడించారు. ‘సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆర్సా మిలిటెంట్లు మమ్మల్ని చుట్టుముట్టారు. మమ్మల్ని బయటకు తీసుకువచ్చి గుంపు కత్తులు, బ్లేడ్‌లు, ఇనుపరాడ్‌లతో విచక్షణా రహితంగా కొట్టారు, నరికారు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాం’ అని బాధితులు వెల్లడించారు. ఈ దాడి నుంచి బయటపడ్డ రాజ్‌కుమార్ అమ్మేస్టీతో మాట్లాడుతూ నా కాళ్లముందే మా నాన్న, సోదరుడు, అంకుల్‌ను వారు పొట్టనపెట్టుకున్నారు అని చెప్పాడు. ఈ దాడుల అనంతరం రోహింగ్యా ఉగ్రవాదులు బంగ్లాదేశ్ పారిపోయారని వారు చెప్పారు. వారు దాడులు చేసి చంపారనడానికి ఇక్కడ ఎన్నో ఆధారాలున్నాయి. కాని మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని హిందూ వర్గానికి చెందిన నాయకుడు నీ వౌల్ తెలిపారు. మిగతా ప్రపంచానికి కూడా ఈ చావుల గురించి పట్టదు అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, రోహింగ్యాల ఉదంతం జరిగిన తర్వాత మయన్మార్ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ఆ ప్రభుత్వం మానవహక్కులు, ఇతర సంస్థలను ఇక్కడకు అనుమతించలేదని, ఆ సంస్థల చర్యలు ఆస్రాలకు అనుకూలంగా ఉండరాదని ఇక్కడకు వారిని రానీయలేదని, ప్రభుత్వ ప్రతినిధి జాహెట్‌వే తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలియజేయడానికి మయన్మార్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి, ఇతరులను దేశంలోకి అనుమతించాలని రాజకీయ విశే్లషకుడు ఒకరు పేర్కొన్నారు.