అంతర్జాతీయం

ఇంతకూ సభ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 2: శ్రీలంకలో విక్రమసింఘేను ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పించి మహిందా రాజపక్సను నియమించడంతో తలెత్తిన సంక్షోభం శుక్రవారం కొత్త మలుపుతిరిగింది. పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు గురువారం నాడొక అధికార ప్రకటనలో వెల్లడించారు. పార్లమెంట్ 5న సమావేశమవుతుందని రాజపక్స కార్యాలయం తెలిపింది. అయితే 7న సమావేశమవుతుందని స్పీకర్ కరు జయసూరియా శుక్రవారం పేర్కొనడం గమనార్హం. దీనికి సంబంధించి అధ్యక్షుడు సిరిసేన ఆమోదం తెలిపారని స్పీకర్ చెప్పారు. ఈనెల 16 వరకూ పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ, దౌత్యపరమైన వత్తిళ్లు రావడంతో సిరిసైన మెట్టుదిగారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. 5న సభ సమావేశమవుతుందని ప్రధాని ప్రకటించగా ఆయన వర్గీయులే దాన్ని ఖండించారు. మరోపక్క అధ్యక్షుడు సిరిసేన పార్టీ గురువారం అర్థరాత్రి ఓ ప్రకటన చేస్తూ ఈనెల 16వ తేదీకి ముందు పార్లమెంట్ సమావేశాలుండవని చెప్పడం గమనార్హం. కాగా విక్రమసింఘే నాయకత్వంలోని యూనైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ), తమిళ నేషనల్ అలయెన్స్, మార్క్సిస్ట్ జనతా విముక్తిపెరమున(జేవీపీ), పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ శుక్రవారం ఉదయం స్పీకర్ జయసూరియాను కలిసి పార్లమెంట్‌ను సమావేశపరచాలని కోరాయి. ఈ విషయాన్ని విక్రమసింఘే అనుచరుడు హర్షా డిసిల్వా ధృవీకరించారు. విక్రమసింఘేను తొలగించి రాజపక్సకు అధికారం అప్పగించినప్పటి నుంచీ సంక్షోభం కొనసాగుతునే ఉంది. పార్లమెంట్‌ను తక్షణం సమావేశపరిచాలని, తాను బలనిరూపణ చేసుకుంటానని విక్రమసింఘే డిమాండ్ చేస్తున్నారు. తనను తప్పించే అధికారం అధ్యక్షుడు సిరిసేనకు లేదని ఆయన వాదిస్తున్నారు. పార్లమెంట్‌లో విక్రమసింఘేకు 106 మంది ఎంపీల మద్దతు ఉంది. రాజపక్సకు 95 మంది ఎంపీలున్నారు. యూఎన్‌పీ నుంచి ఐదుగురు ఎంపీలను రాజపక్స లాకున్నప్పటికీ మెజారిటీ సరిపోదు. ఆయనకు 113 మంది మద్దతు అవసరం. సిరిసేన తీరుకు నిరసనగా యూఎన్‌పీ కార్యకర్తలు మంగళవారం దేశ రాజధానినే దిగ్బంధనం చేశారు.