అంతర్జాతీయం

11 మంది యువకుల గల్లంతు కేసులో... లంక ఆర్మీ చీఫ్ అరెస్టుకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 2: శ్రీలంక సైనిక ప్రధానాధికారి అడ్మిరల్ రవి విజేగుణరత్నేకు న్యాయస్థానం గట్టిషాక్ ఇచ్చింది. ఎల్‌టీటీఈపై సైనిక చర్య సందర్భంగా 11 మంది యువకులు అచూకీ తెలియకుండా పోయింది. అడ్రస్ తెలియకుండాపోయిన వారిలో మైనారిటీ తమిళలున్నారు. 2008-2009 మధ్య కాలంలో ఇది చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ప్రధాని నిందితుణ్ని ఆర్మీ చీఫ్ విజేగుణరత్నే కాపాడుతున్నారని అభియోగం. అదృశ్యమైన 11 మంది హత్యకుగురై ఉంటారని అనుమానిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును విచారించిన కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు సైనిక ప్రధానాధికారి విజేగుణరత్నే అరెస్టుకు శుక్రవారం ఆదేశించారు. ఆర్మీ చీఫ్‌ను అరెస్టు చేసి తమ మందు హాజరుపరచాలని వారెంట్ జారీ చేసింది. ఈనెల 9లోగా అడ్మిరల్ విజేగుణరత్నేను అరెస్టు చేయాలని బెంచ్ ఆదేశించింది. 11మంది యువకుల అదృశ్యం వెనక ఆర్మీ, నేవీ, పోలీసుల హస్తం ఉందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నేవీ అధికారులు బెయిల్‌పై బయటకు వచ్చారు. 2013లో ఏకంగా 19వేల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా తీవ్ర వత్తిళ్లు రావడంతో అప్పటి అధ్యక్షుడు మహిందా రాజపక్స ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎల్‌టీటీఈపై సైనిక చర్య తరువాత వేలాది మంది ఆచూకీ తెలియకుండాపోయిందని పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది.