అంతర్జాతీయం

అక్బర్‌వన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 3: తనపై జరిగిన లైంగిక దాడిపై మాజీ సంపాదకుడు ఎంజే అక్బర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నార నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్) ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఎంజే అక్బర్ వల్ల తనకు జరిగిన అన్యాయంపై వాషింగ్టన్ పోస్టులో చెప్పినవన్నీ వాస్తవాలేనని, వాటికి తాను కట్టుబడి ఉన్నానని శనివారం ఆమె స్పష్టం చేశారు. వాషింగ్టన్ నుంచి పనిచేస్తున్న అమెరికన్ మీడియా సంస్థకు చీఫ్ బిజినెస్ ఎడిటర్‌గా ఉన్న పల్లవి ‘అక్బర్ చెబుతున్నవనీ అవాస్తవాలే’అన్నారు. ఇరువురి ఇష్టపూర్వకంగానే శారీకర సంబంధం కొనసాగిందని అక్బర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయం మరోమహిళకు జరగకూదన్న ఉద్దేశంలోనే మీటూ ద్వారా గళం విపినట్టు గొగోయ్ తెలిపారు. కాగా గొగోయ్ ఆరోపణల నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను శుక్రవారం మాజీ మంత్రి ఖండిస్తూ ‘1994లో పల్లవికి నాకు మధ్య శారీరక సంబంధం ఉండింది. కొన్ని నెలలు ఇది కొనసాగింది. ఇది ఇరువురి ఇష్టపూర్వకంగానే జరిగింది’అని చెప్పుకొచ్చారు. తాను అత్యాచారం చేసినట్టు పల్లవి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అక్బర్ తెలిపారు. దీనికితోడు తన భర్త మంచోడని అక్బర్ భార్య మల్లిక మరోప్రకటనలో వెనకేసుకొచ్చింది. వాషింగ్టన్ పోస్టులో పల్లవి చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది.