అంతర్జాతీయం

ఇప్పట్లో అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీమాఖోంగ్ (మణిపూర్) నవంబర్ 4: వేర్పాటు సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వారి డిమాండ్లు విభిన్నమైనవి కావడం వల్ల మణిపూర్ రాష్ట్రంలో ఈ సమస్యను త్వరగా పరిష్కరించడం అంత సులభం కాదని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ‘రాష్ట్రంలో సుమారు 30 వరకు వేర్పాటువాద గ్రూపులు ఉన్నాయి, వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో డిమాండ్, వారందరి డిమాండ్లపై చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడం కష్టసాధ్యమే’ అని నాగాలాండ్ మేజర్ జనరల్ వీకే మిశ్రా అన్నారు. ఎన్‌ఎస్‌సిఎన్ (ఐ-ఎం), ఎన్‌ఎస్‌సిఎన్ (కె) లాంటి గ్రూపులు నాగాలిమ్ లేక గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ చేస్తున్నాయని, వీరు కాక కుకీ సంస్థలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నాయని, ఎనిమిది గ్రూపులతో ఉన్న యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ మణిపూర్ పరిధిలో హిల్‌స్టేట్‌ను కోరుతున్నాయని ఆయన వివరించారు. పలు వేర్పాటు సంస్థలు ఉండటం వల్ల రాష్ట్రంలో సమస్యల పరిష్కారం సంక్లిష్టంగా మారిందని ఆయన ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించిన జర్నలిస్టులతో పేర్కొన్నారు.