అంతర్జాతీయం

‘పోలీస్ రోబో ’ వచ్చేసింది....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 14: ఇళ్లల్లో పనులు చేసే రోబోలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే, ఇప్పుడు ‘రోబో పోలీస్’ కూడా వచ్చేశాడు. భద్రతా విధులను నిర్వర్తిస్తున్న ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ‘రోబోకాప్’ అందరినీ ఆకట్టుకుంటున్నది. నాలుగు చక్రాల మీద వేగంగా అటూఇటూ తిరుగుతూ, తల భాగంలో ఏర్పాటు చేసిన కెమేరాను నలుదిక్కులా తిప్పుతూ, అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్న ఈ రోబోను చూసిన ప్రతి ఒక్కరూ దానితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహపడుతున్నారు. సుమారు ఐదు అడుగుల ఎత్తుగల ఈ రోబోకాప్ సింగపూర్‌లోని ఒక కనె్వన్షన్ సెంటర్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఎరుపు, నీలం రంగుల్లో ఫ్లాష్ లైట్లతో ముచ్చటగొలిపే ఈ రోబో తలను 360 డిగ్రీల వృత్తంలో ఎటైనా తిప్పగలదు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు తీసి, మానీటర్‌కు పంపగలదు. ముందుగానే ఖరారు చేసిన దారిలో, ఎవరి సాయం లేకుండా ఒంటరిగా వెళ్లగలదు. భద్రతా ఏర్పాట్లలో పోలీసుల మాదిరే అద్భుతమైన సేవలు అందించే సత్తా ఉన్నప్పటికీ, ఈ రోబోను చాలా మంది ఒక పెద్ద బొమ్మలాగా చూడడం విశేషం. కనె్వన్షన్ సెంటర్‌కు వచ్చిన వారంతా దీనిని ఒక పోలీస్‌గా భావించకుండా, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రోబోకాప్ చాలా బాగుందని, ఒక బొమ్మలా అలరిస్తున్నదని చైనా నుంచి సింగపూర్ పర్యటనకు వచ్చిన రువాన్ మిన్ వ్యాఖ్యానించాడు.
రోబోను చూసిన మిగతా వారు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేస్తున్నారు. ఇలావుంటే, భవిష్యత్తులో సమస్యాత్మక ప్రాంతాలతోపాటు, వివిధ వాణిజ్య సముదాయాలు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లలో రోబోకాప్ సేవలు విస్తృతమవుతాయని దీని తయారీదారులు అంటున్నారు.