అంతర్జాతీయం

యోగాతోనే ఆనందమయ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, నవంబర్ 17: భారత ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ వత్తిళ్లు లేకుండా జీవించడం ఎలా అన్న అంశంపై ఇక్కడి వలస కార్మికులకు పాఠాలు బోధించారు. 20 దేశాలకు చెందిన సుమారు 5000 మంది కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాకిస్తాన్ వలస కార్మికులూ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వచ్చారు. సౌదీ రాజు ఫుజారహ్ హమద్ బిన్ మహ్మద్ అల్ షాఖ్కీ ఆహ్వానంపై రవిశంకర్ గురువారం వచ్చారు. శుక్రవారం నాడు షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆహ్లాదకరమైన జీవితం గడపడం ఎలా అన్నదానిపై కార్మికులకు మెలకువలు నేర్పించారు. పూర్వకాలం నుంచి వస్తున్న యోగాశ్రమాల గురించి ఆయన వివరించారు. ఈ యోగా తరగతులకు శ్రీలంక, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, భారత్‌కు చెందిన వలస కార్మికులు హాజరయ్యారు. తొలు త షార్జాలోని సౌత్ ఆసియన్ కార్మిక శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడ వెయ్యి మందికి యోగా శిక్షణ ఇచ్చారు. పది దేశాలకు చెందిన కార్మికులు హాజరయినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నీలి రంగు దుస్తులు ధరించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు. యోగాతోనే జీవితం సంతోషంగా ఉంటుందని రవిశంకర్ ఉద్బోధించారు. పనిలో అంకిత భావం, ఎలాంటి వత్తిళ్లు ఎదురైనా వౌనంగా ఉండడం వల్ల మనిషి హాయిగా జీవించగలదని ఆయన స్పష్టం చేశారు. యూఏఈ అభివృద్ధిలో భారత కార్మికలు క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాయంత్రం దుబాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన యోగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. దుబాయి రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళలు తరలి వచ్చారు.