అంతర్జాతీయం

ఖషోగ్గి హత్య సౌదీ యువరాజు పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 17: జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య వెనక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ తేల్చింది. కాగా సౌదీ అరేబియా మాత్రం తమ యువరాజు పాత్ర లేదని పేర్కొంది. సౌదీరాజు సల్మాన్ ఖషోగ్గిపై అసలు అవగాహన లేదని, ఎవరో తెలియదని పేర్కొన్న విషయం విదితమే. ఈ వివరాలను మీడియా వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని ప్రపంచదేశాలు విశ్వసిస్తున్నాయి. ఈ హత్య జరిగిన తర్వాత వివిధ దేశాలు సౌదీ యువరాజుతీరుపై తీవ్రస్థాయిలోవిరుచుకుపడ్డాయి. వాషింగ్టన్ కాలమిస్టుగాపనిచేస్తున్న ఖషోగ్గి ఇస్తాంబుల్‌లో సౌదీ రాయబారి కార్యాలయంలోకి అక్టోబర్ 2వ తేదీన వెళ్లడాన్ని పలువురు చూశారు. తన పెళ్లికి అవసరమైన రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఖషోగ్గి రాయబారి కార్యాలయానికి వెళ్లారు. టర్కీ దేశంలో సౌదీ రాయబారి కార్యాలయం కాంపౌండ్‌లోనే ఖషోగ్గి హత్యకు గురైనట్లు చివరకు సౌదీ అంగీకరించింది. దాదాపు 15 మంది ఈ హత్య వెనక ఉన్నట్లు సీఐఏ పేర్కొంది. వీరంతా విమానాల్లో వెళ్లారని సమాచారం. సౌదీ యువరాజు ప్రమేయం లేకుండా ఈ హత్య జరగదని సీఐఏ పేర్కొంది. కాగా ఈ హత్య వెనక ఇతర శక్తులు ఉన్నాయని సౌదీ ముందుగా బుకాయించింది. కాగా సౌదీ అరేబియా తీరుపై అమెరికా ఆగ్రహంతో ఉంది. సౌదీతో పాటు యెమెన్ తదితర దేశాల్లో అనేకమంది అమాయకులను చంపేందుకు సౌదీ యువరాజు ఎంబీఎస్ అనే సంస్థను ఉపయోగించుకుంటాడని సీఐఏ పేర్కొంది. సౌదీ, యెమెన్‌లో సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వంపై మానవ హక్కులు, ఉదార వాద సంఘాల నేతలు వత్తిడి పెంచుతున్నారు.