అంతర్జాతీయం

మోదీకి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాలే, నవంబర్ 17:మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మొహమెద్ పదవీ స్వీకార ప్రమాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ ప్రముఖులతో మోదీ మాట్లాడారు. భారత్ నుంచి వచ్చిన మోదీకి ఇంతకు ముందు పార్లమెంట్ స్పీకర్ అబ్దుల్లా మసీ ఘన స్వాగతం పలికారు. 2011లో మన్మోహన్ పర్యాటన తర్వాత ఓ భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. పర్యటనకు ముందు భారత్‌లో ఓ ప్రకటన విడుదల చేసిన మోదీ మాల్దీవుల సమగ్ర అభివృద్ధిని భారత్ కాంక్షిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల మాల్దీవుల ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యపరంగా, పాలనా విధానాల్లోనూ మాల్దీవుల ప్రభుత్వం బలంగా ఉండాలనే భారత్ కోరుకుంటోందని తెలిపారు.