అంతర్జాతీయం

లావోస్, భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఇక కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లావోస్ ప్రధాని, విదేశాంగ మంత్రితో చర్చలు * కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
వియంటియాన్ (లావోస్), నవంబర్ 23: భారత్, లావోటియన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని, ఉభయ దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుడుగు వేయాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఆమె తొలిసారిగా లావోస్ దేశంలో పర్యటించారు. ఈసందర్భంగా లావో ప్రధాన మంత్రి తోంగ్లాన్ శిసోలిథ్‌ను కలుసుకుని శాంతి, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, లావోస్ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యమవుతుందన్నారు. రోడ్లు, వౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇరిగేషన్, ఐటి, మానవ వనరుల అభివృద్ధి తదితర రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. ఇరు దేశాలకు మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆమె లావోస్ విదేశాంగ శాఖ మంత్రి సాలేంక్సే కొమాషిత్‌ను కలిశారు. ఇరు దేశాలు అభివృద్ధి అంశాలను గుర్తించి భాగస్వామ్యంతో పనిచేయాలన్నారు. విద్య, సంస్కృతి, రక్షణ, సమాచార టెక్నాలజీ, ఇంధనం, మైనింగ్ వ్యవహారాల్లో నిర్మాణాత్మకమైన అభివృద్ధిని సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌కు చెందిన నిపుణులను ఇక్కడకు పంపించి ఇక్కడ వారి సేవలు అందిస్తామన్నారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాలకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించాలన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం వచ్చిన సుష్మాస్వరాజ్‌కు ఇక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.