అంతర్జాతీయం

అమెరికాలో హైటెక్ వ్యభిచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 18: అమెరికాలో భారత్ పరువుబజారున పడేసిన హైటెట్ వ్యభిచారం కేసులో భారత సంతతికి చెందిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టాలీవుడ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, వ్యభిచారం, లైంగిక వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్న విమర్శల్లో నిజం లేకపోలేదని తాజా ఉదంతం స్పష్టం చేస్తున్నది. అమెరికాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం బట్టబయలుకావడంతో, టావీవుడ్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సంబంధం ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనలో భారత సంతతికి చెందిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేయగా, దోషుల జాబితాలో కనీసం ఐదుగురు టాలీవుడ్ తారలు ఉన్నారని సమాచారం. దేశ ప్రతిష్టను నిలువునా తీసేసిన ఈ సంఘటన అటు అమెరికాలోని భారతీయుల్లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నది. భారత సంతతికి చెందిన 34 కిషన్ మోదుగుమూడి అమెరికాలో వ్యాపారిగా స్థిరపడ్డారు. అదే సమయంలో భారతీయుల కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాల ముసుగులో అతను, అతని భార్య చంద్ర హైటెక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ తారలతో వ్యభిచారాన్ని గురించి ప్రచారం చేయిస్తున్నారని, ఒక్కో విటుడి నుంచి కనీసం 3,000 డాలర్లు వసూలు చేస్తున్నారని చికాగోలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించిన 42 పేజీల చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక, ఒక్కో అమ్మాయి ఎవరెవరితో, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు వ్యభిచారం జరిపిందీ, ఎంతో సొమ్మును వసూలు చేసిందీ ఒక పుస్తకంలో రికార్డు కూడా చేశారని పోలీసులు వివరించారు. దీనిని పూర్తిగా అనైతిక చర్యగా అభివర్ణించారు.
ఐదుగురు టాలీవుడ్ నటీమణులను పిలిపించి, చికాగోలోని బెల్మోంట్ క్రాగిన్ ప్రాంతంలో ఉంచి, విటుల కోసం వేచిచూస్తున్నారని పోలీసులు తమ పిటిషన్‌లో తెలిపారు. డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర నగరాలోవ్ల సదస్సులను నిర్వహిస్తున్నట్టు బయట ప్రపంచాన్ని నమ్మిస్తున్న కిషన్ దంపతులు నిజానికి ఎంతో మంది మహిళలను వ్యభిచారం ఉచ్చులోకి దించుకున్నారని వివరించారు. వ్యభిచారానికి అంగీకరించని లేదా అధికారులకు వివరాలను అందిందుకు ముందకొచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారని, దీనితో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు వ్యభిచారానికి అంగీకరించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ‘నువ్వు పెద్ద నటివేమీ కావు. నీకు అంతగా గుర్తింపు కూడా లేదు. వివరాలను పోలీసులకు తెలిపితే, నిన్ను, నీ కుటుంబ సభ్యులను హతమార్చడం నాకు కష్టమైన పనేమీ కాదు. జాగ్రత్తగా ఉండు. ఎక్కడా వివరాలను వెల్లడించకు. లేకపోతే నీకే ప్రమాదం’ అని దోషుల జాబితాలో ‘ఏ’గా ఉన్న ఒక నిటిని కిషన్ బెదిరించాడని ఆ చార్జిషీటులో పోలీసులు ఆరోపించారు. అంతేగాక, చాలా మంది పాస్‌పోర్టులను కూడా అతను తన వద్దే ఉంచుకొని, బ్లాక్‌మెయిల్‌కు ఒడిగట్టినట్టు ఆరోపించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమకు అందిన ఒక ఫిర్యాదు మేరకు కిషన్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యభిచరిస్తూ కొంత మంది రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మూడో కంటికి తెలియకుండా నడుస్తున్న వ్యభిచార వ్యహారం బయటపడడంతో, కిషన్ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. జైలు దుస్తుల్లోనే హాజరైన వారు ప్రొసీడింగ్స్‌ను వౌనంగా విన్నారు. కిషన్ దంపతులకు బెయిల్‌ను మంజూరు చేయాలని వారి తరఫు లాయర్ మోలీ ఆర్మోర్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి మరియా వాల్డేజ్ తోసిపుచ్చింది. వారిని జ్యుడిషియల్ కస్టడీలోకి పంపింది. మొత్తం మీద టాలీవుడ్‌పై ఈ హైటెక్ వ్యభిచారం కేసు తీవ్ర ప్రభావం చూపుతున్నది. సినీ తారలు పట్టుబడడంతో ఇది ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న భయాందోళనలు ఇండస్ట్రీలో నెలకొన్నాయి.