అంతర్జాతీయం

మేం కొనసాగలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 20: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగింది. ఏకపక్ష విధానాలను అనుసరిస్తూ, అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హాలే ఒక ప్రకటనలో మానవ హక్కుల సమితి విధానాలను ఎండగట్టారు. ఊహాజనితమైన అంశాలపై ప్రసంగాలను వినదలచుకోలేదని వ్యాఖ్యానించారు. అందుకే, 47 మంది సభ్య దేశాలుగల ఈ సమితి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఎన్నో అంశాలను పట్టించుకోకుండా, ఇజ్రాయిల్ అంశానికే అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అమెరికా-మెక్సికో సరహద్దువద్ద ఎంతో మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు దూరం చేశారంటూ తమపై వచ్చిన ఆరోపణలను నిక్కీ ఖండించారు. అంతర్జాతీయ మానవ హక్కుల సమితిలో మానవ హక్కులకు విరుద్ధ విధానాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తామని, ఆతర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఇది వరకే అమెరికా తేల్చిచెప్పిందని, ఇప్పుడు వైదొలగాలన్న నిశ్చయించామని ఆమె వివరించారు.
ఆశ్చర్యపరుస్తున్న ట్రంప్ నిర్ణయాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పని చేస్తున్న యునెస్కో నుంచి ఇది వరకే అమెరికా వైదొలగింది. యునెస్కోకు బకాయిలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్న ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో అందులో కొనసాగడం కష్టంమని తేల్చిచెప్పారు. యునెస్కో సంపూర్ణ ప్రక్షాళన అవసరమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మానవ హక్కుల సమితి నుంచి వైదొలగి, మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ, పెత్తనం చెలాయిస్తున్న అమెరికా క్రమంగా ఐక్యరాజ్య సమితిలోని వివిధ విభాగాల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని మానవ హక్కుల సమితిపై విమర్శలు గుప్పించడం అంతర్జాతీయ స్థాయిలో మరో వివాదానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తున్నాయి.