అంతర్జాతీయం

చిన్న ఆయుధాల అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 20: సరిహద్దు ప్రాంతాల్లో చిన్నతరహా ఆయుధాల అక్రమ వ్యాపారం ప్రధాన సమస్యగా మారిందని, దీనిని అడ్డుకుంటామని చిన్న ఆయుధాల సరఫరాపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో భారత రాయబారి, నిరాయుధీకరణ సదస్సులో శాశ్వత సభ్యుడు అమన్‌దీప్ సింగ్ గిల్ స్పష్టం చేశారు. పలు దేశాలతో భారత్‌కు విస్తారమైన సరిహద్దు ఉందని, అక్రమ వ్యాపారం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా జోరుగా సాగుతున్నదని, దీనిని అరికట్టడమే తాము అనుసరిస్తున్న సరిహద్దు విధానమని వివరించారు. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని, పరస్పర సహకారం, అభివృద్ధిలో భాగస్వామ్యానికి కృషి చేస్తామని అన్నారు. అదే సమయంలో, సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు పాల్పడుతూ, అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. సరిహద్దుల నుంచి అక్రమంగా చిన్నతరహా ఆయుధాలు దేశంలోకి వస్తున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని అమన్‌దీప్ అన్నారు. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. సరిహద్దుల్లో నెలకొన్న అనేకానేక సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి అనువైన విధానాలను రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. ఇందుకు అన్ని దేశాల సహకారం అవసరమని అన్నారు. సరిహద్దుల్లో పలు చిన్నతరహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాల అక్రమ రవాణా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన దిశగా చర్యలు చేపట్టకపోతే, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని అన్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని పెకళించి వేయడమే తమ లక్ష్యమని అమన్‌దీప్ స్పష్టం చేశారు.