అంతర్జాతీయం

మైత్రి మరింతగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 18: ఐరోపా సమాజంనుంచి బయటకు వెళ్లినప్పటికీ బ్రిటన్‌తో కొనసాగుతున్న సంబంధాల్లో ఏవిధమైన మార్పు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మరింత జవజీవాలు కల్పించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం భారత్, బ్రిటన్ ప్రధానులు మోదీ, థెరెసా మే మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రవాద నిరోధం, రాడికలైజేషన్, ఆన్‌లైన్ ఉగ్రవాదం వంటి సమస్యలపై ఇద్దరు నేతలు లోతుగా చర్చించినట్టు అధికార ప్రకటనలు తెలిపాయి. బుధవారం ఉదయం 10 డౌనింగ్ స్ట్రీట్‌కు మోదీ వచ్చినప్పుడు, థెరెసా మే సంప్రదాయ రీతిలో షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. ‘లండన్‌కు హార్థిక స్వాగతం, ప్రైమ్‌మినిస్టర్’ అంటూ మోదీని థెరిసా ఆహ్వానించారు ఈసందర్భంగా జరిగిన చర్చల్లో సిరియాపై దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ‘ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలను థెరెసా మే వివరించారు. గత మార్చిలో ‘అమలు కాలం’ పై కుదిరిన అంగీకారం వల్ల, భారతీయ కంపెనీలు, మదుపరుల్లో విశ్వాసం పెరిగి ప్రస్తుత నిబంధనల మేరకు 2020 వరకు మార్కెట్లు అందుబాటులో కొనసాగుతాయని థెరెసా మే హామీ ఇచ్చారు’ అని విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఇటీవలి కాలంలో రష్యా ‘అస్థిర పరచే వ్యవహారశైలి’పై బ్రిటన్ అభిప్రాయాన్ని థెరెసా మే స్పష్టం చేశారు. సాలిస్‌బరీలో మాజీ రష్యా గూఢచారి సెర్జీ స్క్రిపాల్ ఆయన కుమార్తె యులియాపై జరిగిన దాడి, రసాయన ఆయుధాలు పదే పదే ప్రయోగిస్తున్న సిరియా ప్రభుత్వానికి వత్తాసు పలకడం వంటి రష్యా చర్యలు ఎంతమాత్రం తమకు సమ్మతం కావని ఆమె కుండబద్దలు కొట్టారు. కాగా 2016లో బ్రిటన్ ప్రధాని భారత్‌లో పర్యటించిన తర్వాత ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య భద్రతాపరమైన, రక్షణ రంగంలో సహకార పురోగతిపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. నేరస్తుల అప్పగింత అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని డౌన్‌టౌన్ స్ట్రీట్ వెల్లడించింది. పైరసీ ఆరోపణలపై గతంలో అరెస్టయిన ‘చైన్నై సిక్స్’గా పేరుపడిన ఆరుగురు బ్రిటన్ సైనికులను గత ఏడాది భారత్ జైలునుంచి తిప్పిపంపడాన్ని థెరిసా మే స్వాగతించారు. గత ఏడాది రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. కాగా రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు యుకె-ఇండియా జాయింట్ ట్రేడ్ రివ్యూ చేసిన సిఫారసులను అమలు పరచాలని కూడా ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారంపై కూడా చర్చలు జరిగాయి. దీనివల్ల వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కామన్‌వెల్త్ దేశాల ప్రజలు సుస్థిరమైన, సంతోషకరమైన జీవితాలను గడపాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధానితో చర్చల అనంతరం మోదీ సైన్స్ మ్యూజియంను సందర్శించారు. ‘5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్’ ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా భారతీయ శాస్తవ్రేత్తలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ ఛార్లెస్ నేతృత్వం వహించారు. అంతేకాకుండా ‘న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ను కూడా ప్రారంభించారు. యోగ, ఆయుర్వేదాలపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. అంతకుంముందు స్టాక్‌హోమ్ నుంచి మంగళవారం రాత్రి ఇక్కడకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి యుకె విదేశాంగ శాఖ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు.