అంతర్జాతీయం

కాశ్మీర్ మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జూన్ 23: జమ్ముకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దీని విచ్ఛిన్నానికి జరిగే కుట్రలను తిప్పిగొడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కృషి వల్లే భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమైందని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి, ఈ ప్రాంతాన్ని దేశం నుంచి వేరు చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి ఎత్తుగడలను చిత్తు చేస్తామని హెచ్చరించారు. కాశ్మీర్ అంశంపై కాంగ్రెస సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరమని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌పై కాంగ్రెస్ ఏవో రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడల్లా, వాటిని సమర్ధించేందుకు ముష్కర సంస్థ లష్కరె తోయిబా సిద్ధంగా ఉంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్‌లో పార్టీ పరిస్థితిని సమీక్షించి వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఉదయం ఆయన ఇక్కడకు వచ్చారు. మహబూబా ముఫ్తీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకున్న తర్వాత తొలిసారి ఆయన కాశ్మీర్ పర్యటనకు రావడం గమనార్హం. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్యాంప్రసాద్ ముఖర్జీ 65వ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆ పార్టీకి, లష్కరె తోయిబాకు సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భరతం పట్టాలంటే పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ ఒక్కటే పరిష్కారమని తేల్చిచెప్పారు. అందుకే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగిందని ఆయన చెప్పారు. అధికారంలో కొనసాగేకంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలనే నిర్ణయంతోనే మెహబూబా ప్రభుత్వానికి మద్దతును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. జమ్ముకాశ్మీర్ కోసం తన ప్రాణాలర్పించిన మహనీయుడిగా శ్యాంప్రసాద్ ముఖర్జీని అభివర్ణించాడు. ప్రపంచంలో ఏ శక్తి కూడా కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయలేదని ఆయన అన్నారు. ముఖర్జీ జీవితం బీజేపి కార్యకర్తలకు ఆదర్శమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాశ్మీర్ కోసం పోరాడారని అన్నారు. ముఖర్జీ తనలాంటి ఎంతోమందికి ఊపిరని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ భారత్‌లో విలీనమయ్యేందుకు ప్రజాపరిషత్ చేసిన కృషిని ఆయన శ్లాఘించారు. భారత్‌లో ప్రజాపరిషత్ తొలి జాతీయోద్యమమని ఆయన గుర్తుచేశారు. ప్రజాపరిషత్ చరిత్రను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలన్నారు. జమ్ముకు చేరుకున్న అమిత్ షా పార్టీకి సంబంధించిన పలు అనుబంధ సంస్థల కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యతా అంశాలపై చర్చించారు. వచ్చే మంగళవారం కాశ్మీర్‌కు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసంలో కాల్పుల విరమణ, ఆ సమయంలో రాష్ట్రంలో తలెత్తిన హింస, పేట్రేగిన ఉగ్రవాదులు, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం, కాల్పుల విరమణను ఎత్తివేయడం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ చేపట్టడం వంటి ఎన్నో అంశాలపై వచ్చే మంగళవారం ఢిల్లీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో 2019 ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి గురించి కూడా చర్చించనున్నారు. కాగా ఈ నెల 28వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అగ్రనేతల సమావేశాన్ని అమిత్ షా ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా జమ్ములో జరిగిన పార్టీ నేతల సమావేశంలోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా, ఉపాధ్యక్షుడు అవినాష్ రాయ్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.