అంతర్జాతీయం

ఎంతకాలం ఆశ్రయమివ్వాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్, జూన్ 23: ఈ నెల 28, 29 తేదీల్లో ఐరోపా యూనియన్ దేశాల సదస్సు బ్రస్సెల్స్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశాల్లోకి వచ్చే శరణార్ధుల సమస్యను పరిష్కరించే విషయమై యూనియన్ దేశాల ప్రతినిధులు ఒక ప్రణాళికను ఖరారు చేయనున్నారు. శరణార్థులు మెరుగైన జీవితం కోసం ఐరోపా దేశాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాని దీని వల్ల ఈ దేశాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. దాదాపు 16 దేశాలు శరణార్థుల సమస్యను చర్చించనున్నాయి. ఐరోపా యూనియన్ దేశాల సదస్సులో శరణార్ధుల సమస్యనే అజెండాలో మొదటిస్థానంలో ఉన్నట్లు జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ చెప్పారు. శరణార్థుల వల్ల తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న దేశాలతో ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆమె చెప్పారు. ఏకాభిప్రాయం కుదిరితే, అవసరమైతే ద్వై, త్రైపాక్షిక ఒప్పందాలను కూడా ఖరారు చేస్తామన్నారు. 2015 నుంచి ఇంతవరకు పది లక్షల మంది శరణార్థులు ఐరోపాదేశాలకు వచ్చారన్నారు. వీరిలో సిరియా, ఇరాక్ దేశాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. శరణార్థుల ఆశ్రయానికి సంబంధించి ఈ దేశాల చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయి. శరణార్థుల వల్ల ఐరోపా దేశా మధ్య కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. శరణార్థుల పట్ల కఠిన వైఖరిని అవలంబించే దేశాల్లో రాజకీయ పార్టీలకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. శరణార్థులు గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాలకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎంతకాలం వీరికి ఆశ్రయం ఇవ్వాలనేదానిపై ఈ దేశాలు సతమతమవుతున్నాయి. మధ్యదరా సముద్రంలో 630 మంది శరణార్థులతో ఉన్న ఒక నౌకను, అందులోని ప్రజలను రక్షించే విషయమై ఇటలీ, ఫ్రాన్స్ మధ్య వివాదం తలెత్తింది. చివరకు స్పెయిన్‌లో అధికారంలోకి వచ్చిన సోషలిస్టు ప్రభుత్వం శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించింది. ఐరోపాలోని మాల్టా అనే చిన్న దేశంలోకి శరణార్థులతో కూడిన నౌకలు వస్తున్నాయి. కాగా శరణార్థుల అంశంపై చర్చించేందుకు తూర్పు ఐరోపా దేశాలు అంగీకరించడం లేదు. చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, స్లోవేకియా దేశాలు శరణార్థులపై చర్చించే సమావేశానికి హాజరు కావడం లేదు.
ఇంగ్లాండ్‌లో ఆర్థిక మాంద్యం
ఐరోపా యూనియన్ నుంచి వైదొలగిన ఇంగ్లాండ్‌లో ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నారు. రియాల్టీమార్కెట్ చతికిలబడింది. ఈయూ దేశాల నుంచి వైదొలగాలని ఇంగ్లాండ్ గత ఏడాది నిర్ణయించింది. దీనినే బ్రెగ్జిట్ అంటారు. వచ్చే ఏడాది మార్చి 29కి ఇంగ్లాండ్ బ్రెగ్జిట్ అయి రెండేళ్లవుంది. బ్రెగ్జిట్ అనుకూలవాదులేమో ఈయూ నుంచి వైదొలగడం మేలైందని, దీనివల్ల త్వరలోనే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామంటున్నారు. ప్రధాని థెరిసా మే మాత్రం తటస్థవైఖరితో ఉన్నారు. మరి కొంతమంది నిపుణులు మాత్రం ఈయూతో పూర్తిగా తెగతెంపులు వద్దని, సంబంధాలు కొనసాగించాలంటున్నారు. పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఇంగ్లాండ్‌లో ఉన్న ఎయిర్ బస్ ప్లాంట్‌ను మూసివేస్తామని ఆ సంస్థ భావిస్తోంది. ఇదే జరిగితే 14వేల మంది కార్మికులు రోడ్డుమీద పడతారని డారెన్ జోన్స్ అనే న్యాయవాది తెలిపారు.