అంతర్జాతీయం

పోలీసుల కిడ్నాప్.. ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖుంతి (జార్ఖండ్), జూన్ 26: కిడ్నాప్ అయిన ముగ్గురు పోలీసుల కానిస్టేబుళ్ల కోసం చేపట్టిన తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ విధులకు ఆటంకం కల్పిస్తున్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఖుంతి జిల్లాలోని ఘాఘ్రా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతాళ్‌గ్రహీ అనే సంస్థ మద్దతుదారులు బీజేపీ ఎంపీ కరియా ముండా నివాసం వద్ద నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేశారు. కానిస్టేబుళ్లను బందీలను విడిపించేందుకు భారీ ఎత్తున పోలీసులు ఘాఘ్రాకు చేరుకున్నారు. ఎంపీ నివాసంలోనూ సోదాలు చేయడానికి ఉపక్రమించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. కానిస్టేబుళ్లను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో భాష్పవాయువుప్రయోగించడంతోపాటు లాఠీలకు పనిచెప్పారు. ఎంత నచ్చజెప్పినా స్థానికులు వినలేదని ఖుంతి జిల్లా ఎస్పీ అశ్వినీకుమార్ సిన్హా వెల్లడించారు. కిడ్నాప్ అయిన ముగ్గురు కానిస్టేబుళ్లను విడిపించడానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్కే మాలిక్ రంగంలోకి దిగారు. అసాంఘిక శక్తులను విడిచిపెట్టబోమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాలిక్ హెచ్చరించారు. పాతాళ్‌గ్రహికి చెందిన కీలక వ్యక్తి యూసుఫ్ పూరిని అదుపులోకి తీసుకోవడానికి వారెంట్‌తో వెళ్లిన పోలీసులను కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. కాగా సంఘటనా స్థలానికి భారీ ఎత్తున పోలీసు బలగాలు చేసుకున్నాయి. ఖుంతి ఎస్పీ సిన్హా, డిప్యూటీ కమిషనర్ సూరజ్ కుమార్ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ కరియా ముండా నివాసం వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేయడమేకాకుండా వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారని ఎస్పీ చెప్పారు. అయితే ఆ సమయంలో ఎంపీ ముండా ఇంట్లో లేరని ఆయన అన్నారు. ఖుంతిలోని పాతాళ్‌గ్రహీ నాయకులు ఆస్తులు జప్తు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.