అంతర్జాతీయం

చల్లారని అమెరికా-చైనా ట్రేడ్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 27: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కలవడం అంతర్జాతీయ దౌత్య, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజులుగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. తమ దిగుమతులపై సుంకాలను అమెరికా పెంచినందుకు నిరసనగా చైనా ప్రతీకార చర్యలు తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను పెంచింది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనం మనం మంచి మిలిటరీ సంబంధాలు కలిగి ఉందామని, దీనికి వాణిజ్య వార్‌కు సంబంధం లేదంటూ చైనా అధినేత జింగ్‌పింగ్‌ను అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కోరారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం సాధించాలని బీజింగ్ పావులు కదుపుతోంది. జిన్‌పింగ్‌తో మాటిస్ బేటీ అయి మిలిటరీ సంబంధాలు, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం అందించుకుందామని ప్రతిపాదించారు. కాగా ఈ చర్చల్లో ఇటీవల అమెరి-చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో తలెత్తిన ఉద్రిక్తతల పరిస్థితులు చర్చకు రాలేదు. గత నెలలోనే మాటిస్ చైనా దక్షిణచైనా సముద్రంలో ఆధిపత్యం చాటేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం విదితమే. తనను కలిసిన మాటిస్‌తో జిన్‌పింగ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా, అమెరికా మధ్య మిలిటరీ సంబంధాల అంశం ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మన మధ్య మిలిటరీ సంబంధాలను పెంపొందించుకున్నామని, వీటిని కొనసాగించాలని జిన్‌పింగ్ కోరారు. ఈ పర్యటన సందర్భంగా జేమ్స్ మాటిస్ చైనా రక్షణ శాఖ మంత్రి వైఫెంగ్, పొలిట్‌బ్యూరో సభ్యుడు యాంగ్ జీచీని కలుసుకున్నారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేమ్స్ మాటిస్ చైనాపర్యటనకు రావడం ఇది తొలిసారి. ఈ సందర్భంగా చైనాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాటిస్ మాట్లాడుతూ చైనాతో అరమరికలకు తావులేకుండా చర్చలు జరిపేందుకు వచ్చానని, రెండుదేశాలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య పారదర్శకతతో కూడిన వ్యూహాత్మక చర్చలు ఉండాలనికోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడే విధంగా చైనా వత్తిడి తేవాలని అమెరికా వ్యూహంగా కనపడుతోంది. ఉత్తరకొరియాకు చైనా అత్యంత సన్నిహితమైన దేశం. మాటిస్ మరో రెండు రోజుల పాటు ఇక్కడ చైనా దౌత్యాధికారులు, వాణిజ్య, మిలిటరీ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 12న ఉత్తర కొరియా నియంత కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సమావేశం తర్వాత అంతర్జాతీయంగా దౌత్య సంబంధాల్లో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఒక వైపు చైనాతో స్నేహ హస్తం అంటూనే మరో వైపు దిగుమతి సుంకాలను పెంచడంపై చైనా గుర్రుగా ఉంది. నిన్నమొన్నటి వరకు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా, అమెరికా పరస్పరం విమర్శించుకున్నాయి. ఉద్రిక్తతలను చలార్చేందుకు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ పర్యటన తోడ్పడుతుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.