అంతర్జాతీయం

ప్రాణం తీసిన పిల్లచేష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెల్లీ, జూలై 4: మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు గుక్కెడు నీళ్లు తాగినా గుటక పడక మరణిస్తారని ఒక నానుడి. అలాగే కొన్ని మిలియన్లకు అధిపతి, తన వ్యాపార నైపుణ్యంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన చైనా టైకూన్ పిల్లచేష్టకు పాల్పడి పిట్టగోడ మీద నుంచి పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం గోడ మీద నుంచి కిందకు పడి తీవ్ర గాయాలతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. హెచ్‌ఎన్‌ఏ గ్రూప్ అధిపతి, పలుదేశాల్లో కోట్లకొద్దీ ఆస్తులు ఉన్న చైనా టైకూన్ వాంగ్ జియాన్ విచిత్రకారణంతో మృతి చెందారు. దక్షిణ ఫ్రాన్స్‌లో సరదాగా హాలీడే ట్రిప్‌లో ఉన్న వాంగ్ జియాన్ మంగళవారం కొండల ప్రాంతమైన బొన్నియక్స్‌ను సందర్శించారు. అక్కడ ప్రకృతి దృశ్యాలు ఆయనను తీవ్రంగా ఆకట్టుకున్నాయి. అయితే అందాలను మరింత స్పష్టంగా చూడాలనుకున్నారో, లేక వాటిని తన కెమెరాలో బంధించాలనుకున్నారో తెలియదు కాని పక్కన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా వారి సహాయం తీసుకోకుండా అక్కడున్న ఒక పిట్టగోడ పైకి దుమికారు.
అయితే ప్రమాదవశాత్తు దానిపై నుంచి పడి పదిమీటర్ల లోతులో పడిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడికి అత్యవసర బృందాలు చికిత్స నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అతను కన్నుమూశారని పోలీస్‌వర్గాలు వెల్లడించాయి. వ్యాపార, ఇతర విషయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వాంగ్ జియాన్ మృతికి చైనాదేశం తీవ్ర సంతాపం ప్రకటించింది. చిన్న ఎయిర్‌లైన్స్‌గా ప్రారంభమైన హెచ్‌ఎన్‌ఏ గ్రూపు త్వరగానే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. వాంగ్ తన సహ వ్యవస్థాపకుడు చెన్‌ఫెంగ్‌తో కలిసి 230 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా దానిని తీర్చిదిద్దాడు. టూరిజం, ఫైనాన్స్, విమానయాన రంగాల్లో తన సామ్రాజ్యాన్ని అంతర్జాతీయంగా విస్తరించాడు.