అంతర్జాతీయం

జకీర్ నాయక్‌ను భారత్‌కు పంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రజయ, జూలై 6: తన వివాదాస్పద ప్రసంగాలతో యువత, ఇతరులను రెచ్చగొట్టడమే కాక, వారిని ఉగ్రవాదంవైపు ప్రోత్సహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్‌ను అతని స్వదేశమైన భారత్‌కు వెనక్కి పంపే ఉద్దేశం తమకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ స్పష్టం చేశారు. తన రెచ్చగొట్టే ప్రసంగాలతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్న జకీర్ నాయక్ 2016లో భారత్ నుంచి మలేషియా పారిపోయాడు. అక్కడ అతనికి శాశ్వత పౌరసత్వం లభించింది.
భారత్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందం మేరకు మలేషియాలో ఉన్న జకీర్‌నాయక్‌ను తమకు అప్పగించాలని భారత్ జనవరిలో ఆ దేశాన్ని కోరింది. అతను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాక, తన రెచ్చగొట్టే ప్రసంగాలతో యువత చెడుమార్గం వైపు వెళ్లడానికి ప్రేరేపించాడని భారత్ పేర్కొంది. అయితే అతనికి తమ దేశంలో శాశ్వత పౌరసత్వం ఉన్నందున, అతని నుంచి తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానందున తాము అతడిని భారత్‌కు అప్పగించలేమని మలేషియా ప్రధాని మహతీర్ కౌలాలంపూర్‌లో విలేఖరులకు తెలిపారు. ఇలావుండగా, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అసత్యాలని నాయక్ ఖండించారు. ఇలావుండగా, 2008 జూలైలో జకీర్ టీవీలో ప్రసంగిస్తూ 2001 సెప్టెంబర్ 11న న్యూయార్కులోని ట్రేడ్‌సెంటర్‌పై దాడికి ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కారణం కాదని పేర్కొన్నారు.
కాగా, నాయక్‌ను తమకు అప్పగించే విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగినట్టు అటు భారత్ అధికారులు కాని, ఇటు మలేషియా అధికారులు కాని నిర్ధారించలేదు.